TVK Vijay Shocking Comments : క‌రూర్ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపించాలి : టీవీకే

మ‌ద్రాసు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విజ‌య్

Hello Telugu - TVK Vijay Shocking Comments

Hello Telugu - TVK Vijay Shocking Comments

TVK Vijay : చెన్నై : త‌మిళ‌నాడులోని క‌రూర్ లో చోటు చేసుకున్న టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ (TVK Vijay) నిర్వ‌హించిన ర్యాలీ తీవ్ర విషాదానికి దారి తీసింది. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు తెర తీసింది. ఈ ఘ‌ట‌న‌లో40 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారంతా ప్ర‌స్తుతం ఆయా ఆస్ప‌త్రుల‌లో చికిత్స పొందుతున్నారు. ఈ మొత్తం ఘ‌ట‌న‌కు పోలీసులే కార‌ణ‌మ‌ని టీవీకే పార్టీ ఆరోపించింది. అయితే రాష్ట్ర డీజీపీ వెంక‌ట రామ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాము టీవీకే విజ‌య్ ర్యాలీకి కేవ‌లం 10 వేల మందిని మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చామ‌ని, కానీ 50 వేల మందికి పైగా వ‌చ్చార‌ని త‌మ వైఫ‌ల్యం ఏమీ లేద‌న్నారు. దీనికి ప్ర‌ధాన కార‌కుడు టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ అని సంచ‌ల‌నా ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న ర్యాలీ సంద‌ర్బంగా క‌రూర్ కు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు రావాల్సి ఉండ‌గా త‌ను రాత్రి 7 గంట‌ల‌కు వ‌చ్చాడ‌ని ఆరోపించారు. ఈ మొత్తం ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు సీఎం ఎంకే స్టాలిన్.

TVK Vijay Shocking Petition

ఇదిలా ఉండ‌గా ఈ ర్యాలీ ఘ‌ట‌న వెనుక ఏదో కుట్ర దాగి ఉంద‌ని పేర్కొంది టీవీకే పార్టీ . ఈ మేర‌కు అత్య‌వ‌స‌రంగా మ‌ద్రాస్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. తొక్కిసలాటపై తమిళగ వెట్రి కజగం పార్టీ స్వయంగా విచారణకు హాజరు కావాలని కోరుతూ చేసిన అత్యవసర ప్రస్తావనను మద్రాస్ హైకోర్టు అనుమతించింది. పార్టీ న్యాయవాదులు దాఖలు చేసిన అత్యవసర ప్రతిపాదనను జస్టిస్ దండపాణి ఆమోదించారు. ఈ కేసును రేపు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో విచారణకు తీసుకునే అవకాశం ఉంది. హైకోర్టుకు పండుగ సంద‌ర్భంగా వారం రోజులు సెల‌వు. జరిగిన సంఘటనకు సంబంధించి కొన్ని కుట్రలు ఉన్నాయని ఆ పార్టీ ఆరోపించింది . స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు చేయాల‌ని ఆ పార్టీ కోరింది.

Also Read : Telangana Election Schedule Interesting : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

Exit mobile version