Telangana Election Schedule Interesting : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

అయిదు ద‌శ‌ల్లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ప్ర‌క‌ట‌న

Hello Telugu - Telangana Election Schedule Interesting

Hello Telugu - Telangana Election Schedule Interesting

Telangana : హైద‌రాబాద్ : తెలంగాణ‌లో ఎన్నిక‌ల న‌గారా మోగింది. సోమవారం రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం (EC) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసింది. 5 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నుంది. తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జ‌రుగుతాయి. మూడు దశల్లో వార్డు, సర్పంచ్ ఎన్నికలు నిర్వ‌హిస్తారు. అక్టోబర్ 9న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 23, 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, నవంబర్ 11న కౌంటింగ్ చేప‌డ‌తారు. అక్టోబర్ 31, నవంబర్ 4, 8న వార్డు, సర్పంచ్ ఎన్నికలు జ‌రుగుతాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిన రోజే కౌంటింగ్ చేప‌డ‌తారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూ. 350 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా ఇందులో రూ.3.08 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. రాష్ట్రంలో 1,67,03,168 మంది గ్రామీణ ఓటర్లు ఎన్నికల్లో పాల్గొంటార‌ని తెలిపింది ఈసీ.

Telangana Panchayat Elections Update

రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలకు ప్రత్యక్షంగా ఎన్నిక‌లు జ‌రుగుతాయి. 565 మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులు, 31 జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్థానాలకు పరోక్షంగా ఎన్నికలు జరుగుతాయని ప్ర‌క‌టించింది ఈసీ. మొత్తం పంచాయతీల్లో వందశాతం ఎస్టీ లున్న పంచాయతీలు 1,248 ఉండ‌గా , షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోనివి 1,289, ఇతర ప్రాంతాల్లోనివి 10,223 ఉన్నాయి. రాష్ట్రంలో 11 గుర్తింపు పొందిన పార్టీలు, 31 నమోదు పార్టీలు తమ గుర్తులపై జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పాల్గొంటాయి.

Also Read : Today Gold Price : నేడు కూడా స్థిరంగా నడుస్తున్న పసిడి ధరలు

Exit mobile version