చెన్నై : తమిళనాడులో రోజు రోజుకు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారి పోతున్నాయి. ఈ తరుణంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు తళపతి విజయ్. ఈ మేరకు ఆయన దేశ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాడు. తనపై సీబీఐ కేసు నమోదు చేసింది కరూర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన సభ రసాభాసాగా మారింది. ఈ ఘటనలో 41 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో డీఎంకే సర్కార్ తనపై విచారణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో సీబీఐ కూడా రంగంలోకి దిగింది. దీనిని సవాల్ చేస్తూ టీవీకే పార్టీ తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా విచారణ మొదలైంది.
మరో వైపు తాను నటించిన చివరి చిత్రం జన నాయగన్ జనవరి 9వ తేదీన విడుదల కావాల్సి ఉంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డు నిలిపి వేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు నిర్మాత. ఇప్పటికే వందల కోట్ల రూపాయలు దీనిపై పెట్టుబడి పెట్టారు.
ఈ మొత్తం వ్యవహారంపై మౌనంగా ఉన్నారు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్. తాజాగా అన్ని పార్టీలకు ఝలక్ ఇస్తూ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీవీకే ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది మిగతా పార్టీలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల ప్రచార కార్యకలాపాలను కొత్తగా ఏర్పడిన కమిటీ నిర్వహిస్తుందని స్పష్టం చేశారు విజయ్.















