TTD- SP Subbarayudu Interesting Update : శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ భ‌ద్ర‌త

కీల‌క స‌మీక్ష చేప‌ట్టిన ఎస్పీ సుబ్బారాయుడు

Hello Telugu - TTD- SP Subbarayudu Interesting Update

Hello Telugu - TTD- SP Subbarayudu Interesting Update

TTD : తిరుప‌తి జిల్లా : తిరుమ‌లలో శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌ర్ 24 నుంచి అక్టోబ‌ర్ 2వ తేదీ జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా భ‌రీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌డంపై ఫోక‌స్ పెట్టారు తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్ . సుబ్బారాయుడు. బ్రహ్మోత్సవాల–2025 నిమిత్తం భక్తుల రాకపోకలకు అనుసంధానంగా ప్రైవేట్ ట్యాక్సీ డ్రైవర్లతో జిల్లా ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వ‌హించారు. ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌కు ముఖ్య సూచ‌న‌లు చేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా గమ్య స్థానాలకు చేరేలా చూసుకోవాల‌ని సూచించారు. గరుడ సేవ రోజు భక్తుల రద్దీ అధికంగా ఉండే దృష్ట్యా, భక్తులతో మర్యాద పూర్వకంగా మెలగాలని అన్నారు. ప్రతి వాహనం తప్పనిసరిగా ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని స్ప‌ష్టం చేశారు.

TTD Brahmotsavams Updates

వాహనాలను అతి వేగంగా నడప కూడద‌న్నారు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. టీటీడీ (TTD), పోలీసుల సూచనలు, నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. వీటిని అతిక్ర‌మిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించిన విధంగా మాత్రమే ట్యాక్సీ ఛార్జీలు వసూలు చేయాల‌ని ఆదేశించారు. పెద్దలకు రూ.110/-, చిన్నపిల్లలకు రూ.60/- రుసుము వసూలు చేయాలని సూచించారు . అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తిన వెంటనే డయల్ 112 ద్వారా పోలీసులను సంప్రదించాలని సుబ్బారాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పి రామకృష్ణ, డియస్పి విజయశేఖర్, ట్రాఫిక్ సీఐ హరిప్రసాద్, డ్రైవర్లు పాల్గొన్నారు.

Also Read : CM Chandrababu – GST 2.0 Growth : జీఎస్టీ 2.0తో దేశం పురోభివృద్ది : సీఎం

Exit mobile version