CM Chandrababu : అమరావతి : ఏపీ శాసణ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. (CM Chandrababu) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా భారత దేశం మరో గొప్ప దశలోకి ప్రవేశించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని స్పష్టం చేశారు. తద్వారా మార్కెట్లో డిమాండ్ పెరిగి కొత్త పరిశ్రమల రాకకు, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి దోహదం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22 నుంచి అమలు చేయబోతున్న జీఎస్టీ 2.0 సంస్కరణలపై శాసన సభలో జరిగిన చర్చ జరిగింది.
CM Chandrababu Key Comments on GST 2.0
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశంలో ప్రతి పౌరునికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లబ్ధి చేకూర్చే నిర్ణయం ఇది అన్నారు. జీఎస్టీ పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతి పెద్ద సంస్కరణలో రాష్ట్ర ప్రతినిధిగా భాగస్వామి కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆగస్ట్ 15న ఎర్రకోట నుంచి చేసిన చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తుందన్నారు. ఈ సంస్కరణలను ముందుండి నడిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కృషి అభినందనీయం అన్నారు. జీఎస్టీ మండలి 56వ సమావేశంలో వాటిని ఆమోదించిందన్నారు. రాష్ట్ర ఆదాయాలకు నష్టం కలుగుతున్నా సామాన్యుల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధానాలను బలంగా సమర్ధించారని చెప్పారు. ఆర్ధిక ఆటుపోట్లను చూస్తూ కూడా సంస్కరణలు వల్ల ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉన్నా.. జీఎస్టీ సంస్కరణలకు ముందుండి మద్దతు తెలిపినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు పవన్ కళ్యాణ్. ఈ చారిత్రక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావడం గమనార్హం అన్నారు.
Also Read : APTDC Special Package Interesting : నవరాత్రుల కోసం ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీ
