TTD Interesting Update : శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

ముగిసిన చంద్ర గ్ర‌హ‌ణం ప్ర‌భావం

Hello Telugu - TTD Interesting Update

Hello Telugu - TTD Interesting Update

TTD :  తిరుమల : శ్రీ‌వారి ఆల‌యంలో సోమవారం ఉదయం 6 గంట‌ల నుండి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. ఆదివారం రాత్రి 9.50 నుండి 1.31 గంట‌ల వ‌ర‌కు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం సాయంత్రం 3.30 గంట‌ల‌కు ఆల‌యం త‌లుపులు మూశారు. దాదాపు 12 గంట‌ల అనంత‌రం సోమవారం ఉదయం 3 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు. ఆల‌య శుద్ధి, పుణ్యా హ‌వ‌చ‌నం, కైంక‌ర్యాలు నిర్వ‌హించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

TTD Darshans Started

చంద్ర గ్ర‌హ‌ణం కార‌ణంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంట‌లకు మూసి వేసిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న ప్ర‌సాదం కాంప్లెక్సును 7.30 గంట‌లకు తెరిచారు. వంట‌శాల శుద్ధి అనంత‌రం ఉదయం 8.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభ‌మైంద‌ని వెల్ల‌డించారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) పాల‌క మండ‌లి ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి జె. శ్యామ‌ల రావు. టీటీడీ ఆధ్వ‌ర్యంలోని అన్ని ఆల‌యాల‌లో శుద్ది కార్య‌క్ర‌మం నిర్వ‌హించి తిరిగి ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల శ్రీ‌వారిని ఆదివారం 27 వేల 410 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 9 వేల 656 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు ఈవో శ్యామ‌ల రావు. ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు 12 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతోంద‌న్నారు. చంద్ర‌గ్ర‌హ‌ణం సంద‌ర్బంగా శ్రీ‌వారి ఆల‌యాన్ని రాత్రి 7 గంట‌ల‌కు మూసి వేశారు. సోమ‌వారం ఉద‌యం సంప్రోక్షణ త‌ర్వాత తిరిగి తెరిచారు.

Also Read : Minister Ponnam Fired on Modi Govt : కేంద్రం క‌క్ష తెలంగాణ‌పై వివ‌క్ష : పొన్నం

Exit mobile version