Minister Ponnam Fired on Modi Govt : కేంద్రం క‌క్ష తెలంగాణ‌పై వివ‌క్ష : పొన్నం

మోదీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన మంత్రి

Hello Telugu - Minister Ponnam Fired on Modi Govt

Hello Telugu - Minister Ponnam Fired on Modi Govt

Minister Ponnam : హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోందంటూ కేంద్రంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాక‌ర్ గౌడ్ (Minister Ponnam). సోమవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీకి పెద్ద ఎత్తున యూరియా కేటాయించార‌ని, కానీ తెలంగాణ రాష్ట్రానికి వ‌చ్చేస‌రికి ఆ కేటాయింపులు లేకుండా పోయాయ‌ని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం రాష్ట్రంలోని రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపి వేసి రైతులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేసింద‌ని మండిప‌డ్డారు. రాష్ట్రానికి తగినంత యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోందని ధ్వ‌జ‌మెత్తారు.

Minister Ponnam Prabhakar Slams Modi Govt

ఎరువులు సరఫరా చేయడానికి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులను తాము స్వ‌యంగా ఢిల్లీకి వెళ్లి క‌లిశామ‌ని చెప్పారు. చాలా సార్లు లేఖ‌లు కూడా రాశామ‌న్నారు. కానీ బిజెపి ప్రభుత్వం ఎరువులు సరఫరా చేయడంలో తెలంగాణ రైతులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఎరువుల తయారీ, దాని సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందన్నారు. రైతులు ఈ విష‌యం అర్థం చేసుకోవాల‌ని కోరారు మంత్రి. యూరియా కొరతకు బాధ్యత వహించాల్సిన వారు పరిస్థితి గురించి పెద్దగా పట్టించు కోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. బీఆర్ఎస్ నాయ‌కులు ప‌ల్లెల్లో రైతుల‌ను రెచ్చ గొడుతున్నార‌ని ఆరోపించారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్.

ఒక రైతు బిడ్డగా మరియు మార్క్‌ఫెడ్ మాజీ ఛైర్మన్‌గా, నేను క్షేత్ర స్థాయిలో రైతుల ఇబ్బందులను గమనిస్తున్నాను. రాష్ట్రానికి చేరుకోవాల్సిన 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో, 5.2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింద‌న్నారు.

Also Read : CM Chandrababu Interesting Update : బ‌హుజనుల సంక్షేమం కోసం ప్ర‌త్యేక చ‌ట్టం

Exit mobile version