జూన్ లో 1,26,81,805 లడ్డూల విక్రయంతో రికార్డ్

వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

hellotelugu-TTDLadduRecord

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టిటిడి) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఏడాది భారీ ఎత్తున భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. మొన్న‌టికి మొన్న ఒకే రోజు ల‌క్ష మందికి పైగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. భారీ ఎత్తున కొత్త టెక్నాల‌జీని వాడుకుని భ‌క్తుల‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది టీటీడీ. ఇదిలా ఉండ‌గా ఓ వైపు ద‌ర్శ‌నం విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకుంటుండ‌గా మరో వైపు శ్రీ‌వారి భ‌క్తుల‌కు అత్యంత ఇష్ట‌మైన‌, ప్రాణ ప్ర‌ద‌మైన శ్రీ‌వారి మ‌హా ప్ర‌సాదంగా భావించే ల‌డ్డూల విక్ర‌యంలో అరుదైన రికార్డు న‌మోదు చేసింది టీటీడీ. గ‌త నెల జూన్ లో లడ్డూల విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకోవ‌డం విశేషం. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా, టీటీడీ లడ్డూల ఉత్పత్తిని గణనీయంగా పెంచుతూ వ‌చ్చింది.

ఎటువంటి కొరత లేకుండా నిరంతరాయగా పంపిణీని చేపట్టింది. తిరుమల: కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు భక్తి భావంతో స్వీకరించే పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు జూన్ నెల‌లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గ‌త ఏప్రిల్ లో మొత్తం 1,11,96,170 లడ్డూలు విక్ర‌యించ‌గా , మే లో 1,21,35,528 లడ్డూలు , జూన్ నెల‌లో ఏకంగా 1,26,81,805 లడ్డూలు అమ్ముడయ్యాయి. గత మూడు నెలలతో పోలిస్తే, జూన్ నెలలో లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. పోలిక కోసం చూస్తే, జూన్ లో 1,02,64,364 లడ్డూలు, జూన్ 2025లో 1,19,21,353 లడ్డూలు అమ్ముడయ్యాయి. జూన్ 2026లో 1,26,81,805 లడ్డూల విక్రయం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. జూన్ 2025తో పోలిస్తే అదనంగా 7,59,452 లడ్డూలు అమ్ముడయ్యాయి, ఇది 6.37 శాతం వృద్ధిని సూచిస్తుంది.

అలాగే, జూన్ 2024తో పోలిస్తే విక్రయాలు 24,17,441 లడ్డూల మేర పెరిగాయి, ఇది 23.55 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలను సందర్శించే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో, భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ పవిత్ర ప్రసాదం అందేలా టీటీడీ శ్రీవారి లడ్డూ ప్రసాదం ఉత్పత్తి , పంపిణీని సమర్థవంతంగా నిర్వహిస్తోంది.

Exit mobile version