TTD Interesting Updates : శాస్త్రోక్తంగా ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యంలో

Hello Telugu - TTD Interesting Updates

Hello Telugu - TTD Interesting Updates

TTD : తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో బుధ‌వారం అంకురార్ప‌ణతో ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం అయ్యాయి. ఈనెల 5వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకు సంబంధించి శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

TTD Ankurarpanam Updates

ఈ సంద‌ర్భంగా ఉద‌యం ఆచార్య రుత్విక్‌వరణంలో భాగంగా ఋత్వికుల‌కు విధులు కేటాయించి వ‌స్త్ర స‌మ‌ర్ప‌ణ చేశారు. ఆల‌య విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతివారిని ఊరేగింపు నిర్వ‌హించారు. ఆ త‌రువాత యాగ‌శాల‌లో అంకురార్పణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా ఇవాళ పవిత్ర ప్రతిష్ట‌ చేపట్టారు. యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన, స్నపన తిరుమంజనం కోసం ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 11 గం.ల నుండి 12.30 గం.ల వరకు కల్యాణ మండపమునందు స్నపన తిరుమంజనం, సేవాకాలము, శాత్తుమొర ఆస్థానం నిర్వ‌హించారు. సాయంత్రం ఉత్సవ మూర్తులు తిరువీధి ఉత్సవం, రాత్రి 7.30 – 9.00 గం.ల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

సెప్టెంబరు 04వ తేదీ స్నపన తిరుమంజనం, శాత్తుమొర, ఆస్థానం, జాప్యం, మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉపసన్నిధి నందు పవిత్ర సమర్పణ, విమాన ప్రాకారం, ధ్వజస్తంభం , మాడ వీధులు, శ్రీ మఠం ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపడుతారు. సాయంత్రం 5.30 – 6.30 గం.ల మధ్య ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

సెప్టెంబర్ 05వ తేదీ ఉదయం స్నపన తిరుమంజనం, శాత్తుమొర, ఆస్థానం, సాయంత్రం ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ప్రబంధ శాత్తుమొర , వేద శాత్తుమొర చేపడుతారు. రాత్రి ఉత్సవ మూర్తులు కుంభం విమాన ప్రదక్షిణంగా సన్నిధిగా వేంచేపు చేస్తారు.

పవిత్రోత్సవాలలో పాల్గొనే భక్తులు రూ. 500/- చెల్లించి ఆర్జిత సేవలో పాల్గొన వ‌చ్చ‌ని తెలిపింది టీటీడీ (TTD). ఒక టికెట్టుపై ఇద్దరికి ప్రవేశం ఉంటుందని, ఒక పవిత్ర ప్రసాదం ఇవ్వబడుతుందని పేర్కొంది. శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయంగార్లు, ఆలయ డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈఓ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ లు చిరంజీవి, ఆలయ ఇన్ స్పెక్టర్ రాధాకృష్ణ ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Also Read : Yamuna River Sensational : పెరిగిన నీటిమ‌ట్టం యమునా న‌ది ఉగ్ర‌రూపం

Exit mobile version