Yamuna River Sensational : పెరిగిన నీటిమ‌ట్టం యమునా న‌ది ఉగ్ర‌రూపం

వ‌ర‌ద హెచ్చ‌రిక జారీ చేసిన అధికారులు

Hello Telugu - Yamuna River Sensational

Hello Telugu - Yamuna River Sensational

Yamuna River : ఢిల్లీ : ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల తాకిడికి పెద్ద ఎత్తున నీటి ప్ర‌వాహం పెరుగుతోంది. దీంతో య‌మునా న‌ది ఉగ్ర రూపం దాల్చుతోంది. నది మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున, అధికారులు వరద హెచ్చరిక జారీ చేశారు. నీటి మట్టం దాదాపు 206.90 మీటర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఈ సంవత్సరం మొదటిసారిగా న్యూఢిల్లీలో భారీ ఎత్తున యమునా నది (Yamuna River) ఉప్పొంగుతోంది. ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద అంత‌కంత‌కూ ప్ర‌వాహం కొన‌సాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. నది మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున, వరద హెచ్చరిక జారీ చేయాల్సి వ‌చ్చింద‌న్నారు. ఇంకొన్ని గంట‌ల్లో ఇది ఇంకా ఉగ్ర‌రూపం దాల్చే ఛాన్స్ ఉంద‌ని లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న ప్ర‌జ‌లంతా సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లి వెళ్లాల‌ని కోరారు.

Yamuna River Huge Flow

ముందు జాగ్ర‌త్తగా ఓఆర్బీ ట్రాఫిక్ కోసం మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. నీటి మట్టం పెరగడానికి కారణం వజీరాబాద్, హత్నికుండ్ బ్యారేజీల నుండి ప్రతి గంటకు అధిక పరిమాణంలో నీరు విడుదల కావడం. నీటి మట్టం మరింత పెరుగుతుందని అంచనా అని సెంట్రల్ ఫ్లడ్ కంట్రోల్ రూమ్ అధికారి వెల్ల‌డించారు. ఉదయం 8 గంటలకు హత్నికుండ్ బ్యారేజీ నుండి 1.62 లక్షల క్యూసెక్కులు , వజీరాబాద్ బ్యారేజీ నుండి 1.38 లక్షల క్యూసెక్కుల నీరు నదిలోకి విడుదలైంద‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం యమునా న‌ది వేగంగా ప్ర‌వ‌హిస్తుండ‌డంతో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ కోరారు.

Also Read : BCCI Exclusive Invitation: టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం బీసీసీఐ ఆహ్వానం

Exit mobile version