తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఒక భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించనున్నారు. సుమారు రూ. 150 నుంచి 160 కోట్ల విలువైన ఈ ఆభరణాలను నవంబర్ 26న ఆయన స్వామి వారికి అందజేయనున్నారు. మొత్తం తొమ్మిది సెట్లుగా అమర్చిన ఈ 45 రకాల బంగారు ఆభరణాలు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే ఒక వ్యక్తి నుంచి అందిన అతిపెద్ద విరాళంగా నిలవనున్నాయి. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఒక భక్తుడు సుమారు రూ. 160 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ పుణ్యక్షేత్రంలో, ఒక వ్యక్తి నుంచి అందిన అత్యంత భారీ విరాళం ఇదేనని ప్రభుత్వ , టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి.
ఒక భక్తుడు నవంబర్ 26న తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించనున్నారు. తొమ్మిది సెట్లుగా రూపొందించిన ఈ 45 రకాల ఆభరణాల విలువ సుమారు రూ. 150 నుంచి 160 కోట్ల వరకు ఉంటుందని అంచన అని ప్రభుత్వ వర్గాల ప్రతినిధి ఒకరు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు .ఈ భక్తుడు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో చర్చలు పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. నిర్ణీత రోజున ఆలయ ప్రాంగణంలో ఈ ఆభరణాలను టీటీడీకి అందజేస్తారని సదరు వర్గాలు వెల్లడించాయి. టీటీడీ వర్గాల సమాచారం ప్రకారం, తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఒక వ్యక్తి సమర్పిస్తున్న అతిపెద్ద కానుక ఇదే కానుంది.
