ఫిబ్రవరి నెల దర్శన, వసతి కోటా విడుదల

అధికారికంగా వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

hellotelugu-TTDQuota

తిరుమ‌ల : శ్రీ‌వారి భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం సాధికారిక మండ‌లి ( టీటీడీ) ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ఈ మేర‌కు అధికారికంగా వ‌చ్చే ఏడాది 2027లో ఫిబ్ర‌వ‌రి నెల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నం, వ‌స‌తి కోటా విడుద‌ల చేసింది. ఈ మేర‌కు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరింది. వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్ప‌టికే ఆర్జిత సేవ కోటా విడుద‌ల చేసింది. ఇందులో భాగంగా తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను నవంబర్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు అని తెలిపింది టీటీడీ. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల‌ని పేర్కొంది. ఈ సంద‌ర్బంగా వారికి టికెట్లు మంజూరవుతాయ‌ని వెల్ల‌డించింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు , శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వ‌యో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించు కునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామ‌ని తెలిపింది టీటీడీ. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోరింది.

Exit mobile version