Trump Shocking H-1B,H-4 Visa Holders : హెచ్-1బీ వీసా ఫీజులపై ట్రంప్ సంచలన నిర్ణయం

ఇప్పుడు హెచ్–1బీ వీసాల విషయంలో కఠిన చర్యలు చేపట్టారు...

Hello Telugu - Trump Shocking H-1B,H-4 Visa Holders

Hello Telugu - Trump Shocking H-1B,H-4 Visa Holders

Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయాలు భారతీయ ఐటీ నిపుణులకు పెద్ద దెబ్బతీశాయి. ఇప్పటికే భారత్‌పై భారీ సుంకాలు విధించిన ఆయన, ఇప్పుడు హెచ్–1బీ వీసాల విషయంలో కఠిన చర్యలు చేపట్టారు.

Trump – వీసా రుసుములో భారీ పెంపు

కొత్త ఆదేశాల ప్రకారం హెచ్–1బీ వీసా పొందాలనుకునే వారు దరఖాస్తు రుసుముగా ఏకంగా లక్ష డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 88 లక్షలు) చెల్లించాలి. ఈ ఉత్తర్వులపై ట్రంప్ (Trump) శుక్రవారం సంతకం చేశారు. తాజా నిబంధనలు సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి వస్తాయి మరియు 12 నెలల పాటు కొనసాగనున్నాయి.

ట్రంప్ వ్యాఖ్యలు

‘హెచ్–1బీ వీసా వ్యవస్థను కొన్ని ఐటీ సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయి. వీసా మోసాలు పెరగడం వల్ల అమెరికన్ ఉద్యోగులకు, ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో పనిచేసే వారికి నష్టం కలుగుతోంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.

మైక్రోసాఫ్ట్ కీలక సూచనలు

ఈ పరిణామాల నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు తక్షణ ఆదేశాలు జారీ చేసింది.

నిపుణుల హెచ్చరికలు

అమెరికాలోని న్యాయ నిపుణులు హెచ్–1బీ వీసా కలిగిన వారు ప్రస్తుతం దేశంలోనే ఉండాలని సూచిస్తున్నారు. తాజా వీసా మార్గదర్శకాలు పూర్తిగా స్పష్టత వచ్చే వరకు అంతర్జాతీయ ప్రయాణాలు మానుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

Also Read : Gold Price Growth : గంటల వ్యవధిలోనే గందరగోళంగా మారిన పసిడి ధరలు

Exit mobile version