Gold : సెప్టెంబర్ 20న దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే గణనీయంగా పెరిగాయి. నిన్నటి రేట్లతో పోలిస్తే ఉదయం 6 గంటల సమయంలో తులం బంగారం (Gold) ధర సుమారు రూ. 200 పెరిగింది. అదే రోజు ఉదయం 11 గంటలకల్లా ధరపై మరో రూ. 820 పెరిగి వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
Gold – బంగారం తాజా ధరలు
- 24 క్యారెట్లు (10 గ్రాములు): రూ. 1,12,150
- 22 క్యారెట్లు (తులం): రూ. 1,02,800 (రూ. 750 పెరుగుదల)
- 18 క్యారెట్లు: రూ. 84,110 (రూ. 610 పెరుగుదల)
మొత్తం మీద నిన్నటి ధరలతో పోలిస్తే బంగారం సుమారు వెయ్యి రూపాయల వరకు పెరిగినట్లు గమనించబడింది.
వెండి ధరల్లో పెరుగుదల
బంగారం ధరలు ఎగిసిపడుతున్న తరుణంలో వెండి కూడా తగ్గేదేలే అన్నట్లు పెరుగుదల కొనసాగిస్తోంది. కిలో వెండి ధర రూ. 2,000 పెరిగి ప్రస్తుతం రూ. 1,35,000 వద్దకు చేరుకుంది. హైదరాబాద్, కేరళ, చెన్నై వంటి నగరాల్లో అయితే కిలో వెండి ధర రూ. 1,45,000 వరకు ఉంది.
ధరలు ఎలా నిర్ణయిస్తారు?
భారతదేశంలో బంగారం ధరలు అనేక అంశాలపై ఆధారపడి మార్పులు చెందుతాయి. వాటిలో ముఖ్యమైనవి:
- అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు
- దిగుమతి సుంకాలు, పన్నులు
- డాలర్–రూపాయి మారకం విలువ
ఈ కారణాలతోనే బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు లోనవుతాయి.
సాంస్కృతిక ప్రాధాన్యత
భారతీయ సంస్కృతిలో బంగారం ఒక ఆభరణాల వస్తువుగా మాత్రమే కాకుండా పెట్టుబడి, పొదుపు సాధనంగా కూడా పరిగణించబడుతుంది. ముఖ్యంగా వివాహాలు, పండుగల సమయంలో బంగారానికి డిమాండ్ మరింతగా పెరుగుతుంది.
Also Read : ISRO New Innovation : ఇకపై టవర్ లేకుండా ఇంటర్నెట్ అంటున్న ఇస్రో
