Trump : బ్రిక్స్ కూటమి దేశాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా స్పందించారు. బ్రెజిల్‌లో సమావేశమైన బ్రిక్స్ దేశాలు అమెరికా విధానాలను విమర్శించడంపై ట్రంప్ (Trump) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిక్స్‌లో భాగస్వాములైన దేశాలపై 10 శాతం అదనపు సుంకాలను విధించనున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో భారత్‌కూ మినహాయింపు లేదని స్పష్టం చేశారు.
Trump Warning to India
డాలర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాలంటే, దాని పరిణామాలకు సిద్ధంగా ఉండాలన్నారు. “డాలర్‌ను ఎవరు సవాలు చేసినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వారు గేమ్ మొదలుపెడితే, నేనూ మొదలుపెడతాను” అంటూ ట్రంప్ హెచ్చరించారు. శ్వేతసౌధంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌తో అమెరికా సంబంధాలు మెరుగ్గానే ఉన్నా, బ్రిక్స్‌లో భాగస్వామిగా ఉన్నందున భారత్ కూడా అదనపు సుంకాలను చెల్లించాల్సిందేనని ట్రంప్ అన్నారు. ఎవరూ మినహాయింపులు ఆశించవద్దన్నారు. బ్రిక్స్ కూటమిలోని 11 దేశాలు ప్రపంచ జీడీపీలో 40 శాతం వాటాను కలిగి ఉండగా, ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఈ దేశాల్లోనే ఉంది.
ఇంతలోనే రియో డిక్లరేషన్‌ను బ్రిక్స్ దేశాలు ఆమోదించడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది అమెరికా ఆర్ధిక ఆధిపత్యాన్ని తగ్గించే యత్నంగా భావిస్తున్నట్టు తెలిపారు.
ఇక భారత్ – అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం పై ఆశలు ఉన్న వేళ, ట్రంప్ ప్రకటన ఊహించని దిశగా మలుపు తిరిగింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్లకు పెంచే లక్ష్యంతో చర్చలు సాగుతున్నాయి. అయితే, ట్రంప్ చేసిన ప్రకారం ఆగస్టు 1నుంచి సుంకాలు అమల్లోకి రావచ్చు, గడువు పొడిగింపు ఉండదని ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు.
Also Read : PM Modi-Trump Big Deal : భారత్-అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్‌పై ఉత్కంఠ
