PM Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచి పలు దేశాలపై పెరిగిన టారిఫ్‌లు, వాణిజ్య ఒప్పందాలపై కఠిన శైలి కొనసాగుతోంది. ఇప్పటికే చైనా, బ్రిటన్, భారత్ సహా అనేక దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్, తాజాగా భారత్‌తో కీలక ఒప్పందం దాదాపు ఖరారయ్యింది అని ప్రకటించారు.
PM Modi-Donald Trump Today Meet
అమెరికా షరతులకు అనుగుణంగా దేశాలు ఒప్పుకోవాలని, లేదంటే భారీ టారిఫ్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఇందులో భాగంగా 14 దేశాలకు ఆయన లేఖలు కూడా పంపించారు. బ్రిటన్, చైనాలతో ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించిన ట్రంప్, తాత్కాలికంగా ఆయా దేశాలపై విధించిన టారిఫ్‌లు తగ్గించినట్లు తెలిపారు.
భారత్‌కు స్పెషల్ డీల్?
భారత్‌తో జరగబోయే ఒప్పందం ఎంతో ప్రత్యేకమైనదిగా ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం, ఈ రోజు రాత్రి 10 గంటలకు భారత్-అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్ ప్రకటించే అవకాశముంది. అయితే ఇందులో తక్కువ వడ్డీతో కూడిన బేస్‌లైన్ టారిఫ్‌లు (10%) కొనసాగుతాయని, కానీ వాణిజ్య ఒప్పందంలో వస్త్ర, తోలు ఉత్పత్తులు వంటి శ్రమ ఆధారిత రంగాలకు ఊరట లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అయితే వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం ఈ ఒప్పందంలో భాగం కాదని వార్తలు వస్తున్నాయి. ఈ డీల్‌కు సంబంధించిన చర్చలు ఇరుదేశాల వాణిజ్య శాఖల మధ్య ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
భారత్ స్పష్టత: తొందరేమీ లేదు
వాణిజ్య ఒప్పందంపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal), దేశ ప్రయోజనాలనే ప్రామాణికంగా తీసుకుని మాత్రమే ఒప్పందాన్ని ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. “డెడ్‌లైన్లు గడిచిన పేరుతో ఒత్తిడిలో ఒప్పందాలు కుదుర్చుకునే పరిస్థితి భారత్‌దికాదు. జాతీయ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒప్పందం కుదరకపోతే గతంలో విధించిన 26 శాతం సుంకాలు మళ్లీ అమల్లోకి రావచ్చు అనే అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు, అమెరికా వైఖరి తదితర అంశాలపై అంతర్జాతీయ వాణిజ్య వర్గాలు ఉత్కంఠగా చూస్తున్నాయి.
Also Read : Trump Shocking Tariffs : ప్రపంచ దేశాల మీద మరోసారి మొదలు పెట్టిన ట్రంప్ టారిఫ్ లు
