Trump Sensational Comments : వ్లాదిమిర్ పుతిన్ తో మ‌రోసారి మాట్లాడతా

స్ప‌ష్టం చేసిన అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్

Hello Telugu - Trump Sensational Comments

Hello Telugu - Trump Sensational Comments

Trump : అమెరికా : అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌రోసారి ఆయ‌న ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. తాను త్వ‌ర‌లోనే పుతిన్ తో మాట్లాడ‌తాన‌ని అన్నారు. శుక్ర‌వారం ట్రంప్ (Trump) మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ కౌంటర్ వోలోడిమిర్ జెలెన్స్కీ , యూరోపియన్ నాయకులతో తాను ఫోన్ చేశాన‌ని చెప్పారు. దాడుల ప‌రంప‌ర కొన‌సాగుతుండ‌డం వ‌ల్ల ఉక్రెయిన్ కు తీర‌ని న‌ష్టం వాటిల్లుతుంద‌న్నారు. ఈ స‌మ‌స్య మ‌రింత పెద్ద‌దిగా కాకుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అందుకే తాను జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు అమెరికా చీఫ్‌.

Trump Shocking Comments

ఇదిలా ఉండ‌గా యుఎస్ లోని వైట్ హౌస్‌లో ప్రముఖ అమెరికా టెక్ ఎగ్జిక్యూటివ్‌లతో విందు ఇచ్చారు స్వ‌యంగా అధ్య‌క్షుడు. ఈ సందర్భంగా సమీప భవిష్యత్తులో రష్యన్ నాయకుడితో మాట్లాడతారా అని అడిగిన మీడియాకు కీల‌క స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కాల్పుల విరమణ జరిగితే లేదా ఉక్రెయిన్‌కు భద్రతా హామీల కోసం ప్రణాళికలను ధృవీకరించే లక్ష్యంతో పారిస్‌లో శిఖ‌రాగ్ర స‌మావేశం జ‌రిగింద‌న్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు తాను ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ తో ప‌లుమార్లు ప‌దే ప‌దే ఉక్రెయిన్ పై దాడుల గురించి ప్ర‌స్తావించాన‌ని చెప్పారు. ర‌ష్యా ఇప్ప‌టి వ‌ర‌కు 500కు పైగా దాడులు చేసింద‌ని, 12కి పైగా మిస్సైల్స్ ను ప్ర‌యోగించింద‌న్నారు.

Also Read : NASA New Innovation : భారత సంతతికి చెందిన అమిత్ కు కీలక బాధ్యతలు

Exit mobile version