Trump Strong Focus : శాశ్వ‌త నివాసం కోసం ట్రంప్ గోల్డ్ కార్డ్

100 మిలియ‌న్ల ఆదాయంపై యుఎస్ ఫోక‌స్

Hello Telugu - Trump Strong Focus

Hello Telugu - Trump Strong Focus

Trump : అమెరికా : అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అమెరికాలో ఉంటూ డాల‌ర్ల‌ను కొల్ల‌గొట్టాల‌ని భావించే వారికి తీపి క‌బురు చెప్పారు. కానీ ఇది అత్యంత ఖ‌ర్చుతో కూడుకుని ఉన్న‌ది. ఇక అమెరికాలో శాశ్వ‌త నివాసం పొందాల‌ని అనుకున్న వాళ్ల‌కు గోల్డ్ కార్డును ప్ర‌క‌టించాడు. ఈ గోల్డ్ కార్డ్ హోల్డర్లు యునైటెడ్ స్టేట్స్‌లో శాశ్వతంగా నివసించడానికి, పని చేయడానికి పూర్తి హక్కులతో ప్రివిలేజ్డ్ శాశ్వత నివాసితులుగా ప‌రిగ‌ణించ బ‌డ‌తార‌ని స్ప‌ష్టం చేసింది యుఎస్ ప్ర‌భుత్వం. ఈ మేర‌కు అధికారికంగా సంత‌కం చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఇదే స‌మ‌యంలో బిగ్ షాక్ ఇచ్చాడు ప్ర‌వాస భార‌తీయుల‌కు. హెచ్ 1 బి వీసా రుసుమును భారీగా పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాడు. ల‌క్ష డాల‌ర్లు ఫీజు నిర్ణ‌యించాడు. ఇది సెప్టెంబ‌ర్ 21 నుంచి అమ‌లులోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశాడు.

Donald Trump Strong Focus

ట్రంప్ పరిపాలన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ప్రీమియం ఇమ్మిగ్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అమెరికన్ ట్రెజరీకి బిలియన్ల ఆదాయాన్ని సంపాదించగల ఖరీదైన గోల్డ్ కార్డ్‌ల ద్వారా అమెరికా శాశ్వత నివాసాన్ని అందిస్తోంది. వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ దీనిని ప్రకటించారు, అమెరికా దేశానికి గణనీయమైన ఆర్థిక సహకారాలు అందించగల సంపన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చట్టపరమైన వలసలను ఎలా సంప్రదిస్తుందో దానిలో ఇది ఒక ప్రాథమిక మార్పుగా అభివర్ణించారు. వ్యక్తిగత దరఖాస్తుదారులు శాశ్వత నివాసం కోసం సుమారు రూ. 8.5 కోట్లు చెల్లంచాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగులను స్పాన్సర్ చేసే కార్పొరేషన్లు ఒక్కొక్కరికి USD 2 మిలియన్లు చెల్లిస్తాయి.

Also Read : H-1B Visa Fees Huge Hike : ఎన్నారైల‌కు షాక్ హెచ్1బి వీసా ఫీజు పెంపు

Exit mobile version