H-1B Visa Fees Huge Hike : ఎన్నారైల‌కు షాక్ హెచ్1బి వీసా ఫీజు పెంపు

కోలుకోలేని దెబ్బ కొట్టిన యుఎస్ చీఫ్ ట్రంప్

Hello Telugu - H-1B Visa Fees Huge Hike

Hello Telugu - H-1B Visa Fees Huge Hike

H-1B Visa : అమెరికా : ప్ర‌వాస భార‌తీయుల‌కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. డాల‌ర్ల‌ను సంపాదించాల‌ని అనుకున్న ఎన్నారైల‌కు, విదేశీయుల‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు. రోజుకో త‌ల తిక్క నిర్ణ‌యం తీసుకుంటూ ఆందోళ‌న రేకెత్తిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు అమెరికా ప్ర‌భుత్వం ఇవాళ విధి విధానాల‌ను ఖ‌రారు చేసింది. ఉత్త‌ర్వులను జారీ చేసింది. హెచ్1బి వీసా (H-1B Visa) నిబంధ‌న‌ల‌లో కీల‌క‌ మార్పులు తీసుకు వ‌చ్చారు. వీసా ద‌ర‌ఖాస్తు రుసుమును భారీగా పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. లాట‌రీ సిస్ట‌మ్ ను తొల‌గిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఏకంగా ల‌క్ష డాల‌ర్లు (భార‌తీయ రూపాయ‌ల‌లో కోటి ) చెల్లించాల‌ని ఆదేశించారు. ఇదే స‌మ‌యంలో కొత్త‌గ‌గా ట్రంప్ గోల్డ్ కార్డును ప్ర‌క‌టించారు. దీని ధ‌ర 10 ల‌క్ష‌ల డాల‌ర్లుగా నిర్ణ‌యించారు. దీని ద్వారా అమెరికాకు 100 మిలియ‌న్ డాల‌ర్ల ఆదాయం వ‌స్తుంద‌ని యుఎస్ స‌ర్కార్ భావిస్తోంది.

H-1B Visa Fees Huge Hike

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం H-1B వీసా రుసుములను పెంచే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఐటీ సంస్థలు H-1B వ్యవస్థను ‘తారుమారు’ చేశాయని పేర్కొన్నారు. వలసేతర వీసా కార్యక్రమాన్ని తాత్కాలిక కార్మికులను యునైటెడ్ స్టేట్స్‌లోకి తీసుకువచ్చి, అధిక నైపుణ్యం కలిగిన విధులను నిర్వర్తించడానికి రూపొందించారు, కానీ తక్కువ జీతం, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులతో భర్తీ చేయడానికి బదులుగా ఉద్దేశ పూర్వకంగా దోపిడీ చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అందుకే వీసా జారీ చేసేందుకు ఫీజు పెంచాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్.

Also Read : Pak Ex PM Imran Khan Sensational Allegations : న‌న్ను నా భార్య‌ను టార్చ‌ర్ చేస్తున్నారు

Exit mobile version