30న మారథాన్ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు

హైద‌రాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డే ఛాన్స్

hellotelugu-HyderabadTrafficPolice

హైద‌రాబాద్ : నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ (ఎన్ఎండీసీ) ఆధ్వ‌ర్యంలో హైదరాబాద్ మారథాన్ 14వ ఎడిషన్ నిర్వ‌హిస్తోంది ఈనెల 30వ తేదీ ఆదివారం రోజు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డే ఛాన్స్ ఉంది. దీంతో హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందస్తు ప్లాన్ రూపొందించారు. మార‌థాన్ వ‌ల్ల హైదరాబాద్ , సైబరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి ట్రాఫిక్ మళ్లింపులు ఎదురయ్యే అవకాశం ఉంది. ట్రాఫిక్ పోలీసుల సూచన ప్రకారం మారథాన్ సజావుగా సాగేందుకు వీలుగా ఉదయం 4 గంటల నుండి 11:30 గంటల వరకు పలు రహదారులపై ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి.

ఈ కార్యక్రమంలో పూర్తి మారథాన్ (42.195 కి.మీ), హాఫ్ మారథాన్ (21.097 కి.మీ) , 10K రన్ అనే మూడు విభాగలు ఉంటాయి. పూర్తి , హాఫ్ మారథాన్‌లు నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభం అవుతాయి. కాగా 10K రన్ మాదాపూర్, ఖానామెట్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ హాల్ వద్ద మొదలవుతుంది. ఈ మూడు మార్గాలు చివరకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వద్ద కలుస్తాయి. ఇదే ఈ పరుగు పందెం ముగింపు స్థానం కానుంది. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని , వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నెక్లెస్ రోడ్, మాదాపూర్, గచ్చిబౌలి, పరిసర ప్రాంతాల గుండా ప్రయాణించే వారికి ఈ కార్యక్రమ సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఆదివారం ఉదయం 5 గంటల నుండి 11:30 గంటల మధ్య ఈ మారథాన్ రన్‌లు జరగనున్నాయి ప్రయాణికులు బయలు దేరే ముందు తాజా ట్రాఫిక్ వివరాలను తెలుసు కోవాలని, ప్రయాణానికి అదనపు సమయాన్ని కేటాయించు కోవాలని సూచించారు.

Exit mobile version