TPCC Chief Mahesh Goud Interesting : బీసీ రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించి తీరుతాం

స్ప‌ష్టం చేసిన టీపీసీసీ చీఫ్ మ‌హేష్ గౌడ్

Hello Telugu - TPCC Chief Mahesh Goud Interesting

Hello Telugu - TPCC Chief Mahesh Goud Interesting

TPCC Chief Mahesh Goud : హైద‌రాబాద్ – 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కు ఉన్న కమిట్‌మెంట్ ఏ పార్టీకి లేద‌న్నారు. టెక్నికల్ కారణాలు చూపించి బీజేపీ మోకాలు అడ్డుతోంద‌ని ఆరోపించారు. బీసీలకు బీజేపీ బద్ధ విరోధి అని మండిప‌డ్డారు. ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్లు ఇచ్చి తీరాలన్నదే మా ప్రయత్నం అన్నారు పీసీసీ చీఫ్‌. శ‌నివారం టీపీసీసీ చీఫ్ (TPCC Chief Mahesh Goud) మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కావాల‌ని బీజేపీ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు. మ‌రో వైపు దీనిని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు ట్రై చేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు బీఆర్ఎస్ పార్టీపై.

TPCC Chief Mahesh Goud Key Comments

ఇప్ప‌టికే తాము ఏ పార్టీ చేయ‌ని విధంగా స‌మాజంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. ఆరు నూరైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించి తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రంలో చేయ‌ని విధంగా కుల గ‌ణ‌న స‌ర్వే చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఇది దేశానికే ఆద‌ర్శ ప్రాయంగా నిలుస్తుంద‌న్నారు. ఇదే క్ర‌మంలో త‌మ పార్టీ ఆధ్వ‌ర్యంలో దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆందోళ‌న చేప‌ట్టామ‌ని, త‌మ ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సైతం పాల్గొన్నార‌ని అన్నారు.బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు అన్ని పార్టీలు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Also Read :TDP Chief Interesting Comments : శ్రీ‌కృష్ణుడి జీవిత‌మే ఓ సందేశం – టీడీపీ చీఫ్

Exit mobile version