కేంద్రంతో ఒప్పందం ప‌చ్చి అబ‌ద్దం : వాంగ్ చుక్

అణిచివేత భ‌యంతోనే దీక్ష విర‌మించాన‌ని ప్ర‌క‌ట‌న

hellotelugu-SonamWangchuck

న్యూఢిల్లీ : కేంద్రంతో తాను ఒప్పందం చేసుకుంటున్న‌ట్లు వ‌చ్చిన ప్ర‌చారాన్ని ఖండించారు ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ వేత్త , సామాజిక కార్య‌క‌ర్త సోనం వాంగ్‌చుక్ . అణచివేత భయంతోనే నిరాహార దీక్ష విరమించినట్లు తెలిపారు. నిన్న‌ రాత్రి ఆలస్యంగా పోస్ట్ చేసిన ఒక యూట్యూబ్ వీడియోలో శాంతియుత నిరసనకారుడిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని కేంద్రం లిఖిత పూర్వక హామీ ఇచ్చిన తర్వాతే తాను తన నిరవధిక నిరాహార దీక్షను విరమించడానికి అంగీకరించినట్లు వాంగ్‌చుక్ తెలిపారు. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. గురుగ్రామ్‌లో కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. కేంద్రంతో ‘ఒప్పందం’ కుదుర్చుకున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చారు.

లడఖ్‌లో 2025లో యువకులపై జరిగిన కాల్పుల ఘటనను గుర్తు చేశారు. ఢిల్లీలో నిరసనకారులపై తక్షణమే అణచివేత చర్యలు చేపడతాయన్న భయంతో, విద్యార్థులపై ఎలాంటి హింస జరగకుండా నివారించేందుకే లిఖిత పూర్వక హామీ పొందిన తర్వాతే తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించానని ఆయన అన్నారు. ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని కేంద్రం లిఖిత పూర్వక హామీ ఇచ్చిన తర్వాతే తన నిరవధిక దీక్షను విరమించడానికి అంగీకరించానని చెప్పారు. చర్చల సమయంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను తాను కోరలేదని ఆయన వివరించారు. ప్రభుత్వంతో రాజీపడ్డారన్న ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. నిన్న రాత్రి సుమారు అర్ధరాత్రి సమయంలో, మంత్రులు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడానికి అంగీకరించారని నాకు చెప్పారు. నేను తొందరలో ఉన్నాను ఎందుకంటే ఢిల్లీలో పరిస్థితి అలా ఉంది. పెద్ద ఎత్తున అణచివేత జరగవచ్చనే ఆందోళన నెలకొంది. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.

Exit mobile version