TDP Chief Interesting Comments : శ్రీ‌కృష్ణుడి జీవిత‌మే ఓ సందేశం – టీడీపీ చీఫ్

మంగ‌ళ‌గిరి టీడీపీ ఆఫీసులో జ‌న్మాష్ట‌మి వేడుక‌లు

Hello Telugu - TDP Chief Interesting Comments

Hello Telugu - TDP Chief Interesting Comments

TDP Chief : మంగ‌ళ‌గిరి – శ్రీ‌కృష్ణుడు జీవిత‌మే ఓ సందేశ‌మ‌ని, ఆయ‌న చేసిన బోధ‌న‌లు నేటికీ స్పూర్తగా నిలుస్తాయ‌న్నారు టీడీపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్ట‌మ‌ని నిర్వ‌హించారు. ఈ వేడుకల్లో పాల్గొన్నారు పార్టీ చీఫ్ పల్లా శ్రీ‌నివాస‌రావు (TDP Chief). ఈ సంద‌ర్బంగా గోపాలకృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప‌ల్లా మాట్లాడుతూ, శ్రీకృష్ణుడు ధర్మానికి అండగా నిలిచి సమాజానికి న్యాయం చేశాడని అన్నారు. శ్రీకృష్ణుడి గీతా సూత్రాలు యుగ యుగాల పాటు మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తోందని అన్నారు ప‌ల్లా శ్రీ‌నివాస రావు.

TDP Chief Palla Srinivasarao – Sri Krishna Janmashtami

రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో సుపారిపాలన అందిస్తున్నామని, 40 రోజుల్లో సుపారిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా కోట్లాది ప్రజల ఇళ్లను సందర్శించి వారి అభిప్రాయాలను సేకరించామని పేర్కొన్నారు. ప్రజల్లో చంద్రబాబు పాలనపై అపార విశ్వాసం నెలకొందని ఆయన వివరించారు.సూపర్ సిక్స్ హామీలలో 90 శాతం అమలు చేయడం ద్వారా ప్రభుత్వ నిబద్ధతను చూపించామన్నారు. ముఖ్యంగా మహిళల కోసం ప్రారంభించిన స్త్రీశక్తి ఉచిత బస్సు సేవ లక్షలాది కుటుంబాలకు ఊరటనిస్తోందని, ఇది మహిళల గౌరవానికి, భద్రతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని పల్లా స్పష్టం చేశారు.

గత ప్రభుత్వంలో అణచివేత, అరాచకాలు మాత్రమే ఉండేవ‌న్నారు. ఇప్పుడు రాష్ట్రంలో స్వేచ్ఛా వాతావరణం నెలకొని, సంక్షేమం–అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు, నేతలు పరుచూరి కృష్ణ, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. చిన్నారులకు మిఠాయిలు, పుస్తకాలు పంపిణీ చేశారు.

Also Read : Devineni Uma Interesting Comments : అరుదైన నాయ‌కుడు స‌ర్దార్ గౌతు ల‌చ్చ‌న్న

Exit mobile version