TPCC Chief Mahesh : హైదరాబాద్ – టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి. ఆయన బహిరంగంగానే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. తనపై సంచలన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చేలా పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు. తన నియోజకవర్గానికి నిధులు రావడం లేదంటూ వాపోయారు. ఈ సందర్బంగా సీరియస్ గా స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh). ఆయన వ్యవహారం గురించి తన పరిధిలో లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ సంఘం చూసుకుంటుందన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసు కోవాలని తాను ఆదేశించడం జరిగిందన్నారు.
TPCC Chief Mahesh Goud Key Comments
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. తను అన్నది పైసల గురించి కాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆగి పోయిన బిల్లుల మంజూరు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని చెప్పారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. తాను ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవికి విషయం గురించి వివరించానని తెలిపారు. ఇదే సమయంలో ఏఐసీసీ దృష్టికి కూడా తీసుకు వెళ్లడం జరిగిందన్నారు టీపీసీసీ చీఫ్. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది మార్వాడీల అంశం. వారంతా గత కొన్నేళ్లుగా ఇక్కడే ఉన్నారని, వారు ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో అంతర్భాగంగా ఉంటారని స్పష్టం చేశారు మహేష్ కుమార్ గౌడ్.
Also Read : APSRTC Interesting News : ఏపీఎస్ఆర్టీసీలో 1500 డ్రైవర్ పోస్టుల భర్తీ
