APSRTC : అమరావతి – నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది ఏపీఎస్ఆర్టీసీ. 1500 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కనీసం 10వ తరగతి అర్హత కలిగి ఉండాలని, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆర్టీసీ డిపోలలో పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కనీస వయస్సు 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉండాలని పేర్కొంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయో పరిమితి సడలించినట్లు, ఎక్స్ సర్వీస్ మెన్ కు 45 ఏళ్ల వరకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. కనీసం 18 నెలల హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి. హెచ్ ఎం వీ లైసెన్స్ విధిగా అవసరమని పేర్కంది.
APSRTC New Drivers Recruitment
డ్యూటీ పరంగా ఆన్ కాల్ (తప్పనిసరిగా అవసరమైనప్పుడు మాత్రమే పిలుస్తారు). ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) రూల్స్ ప్రకారం వేతనం చెల్లిస్తారు. దరఖాస్తులను ఆగస్టు 15 నుంచి ప్రారంభించినట్లు తెలిపింది. శారీరక పరంగా అభ్యర్థులు కనీసం ఎత్తు 160 సెం.మీ (5.2 అడుగులు) ఆరోగ్యంగా ఉండాలి. తెలుగు చదవడం, అర్థం చేసుకోవడం అవసరం. దరఖాస్తులకు సంబంధించి దగ్గరలో ఉన్న ఆర్టీసీ డిపోకు వెళ్లడం, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను తీసుకు వెళ్లడం, అక్కడే డ్రైవింగ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేస్తారని తెలిపారు ఎండీ ద్వారకా తిరుమల రావు.
దరఖాస్తుల వెంట అభ్యర్థులు విధిగా 3 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, పుట్టిన తేదీ ధృపత్రం, 10వ తరగతి మెమమో, హెచ్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్ నెస్ సర్టిఫికెట్ (ఆర్టీఓ నుంచి పొందింది) . కుల ధ్రువీకరణ పత్రం, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్ చూపించాలి. ఎంపిక విధానంకు సంబంధించి ఈ ఉద్యోగం కోసం ఎలాంటి పరీక్ష ఉండదని స్పష్టం చేసింది ఏపీఎస్ఆర్టీసీ. మూడు దశల ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపింది. మొదట డ్రైవింగ్ టెస్ట్, తరువాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డ్రైవర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
Also Read : KTR Shocking Comments : కాళేశ్వరంపై దుష్ప్రచారం అబద్దం
