Tilak Varma Interesting Play : తిల‌క్ వ‌ర్మ విరాట్ కోహ్లీ లాగా ఆడాడు

ప్ర‌శంస‌లు కురిపించిన ఇర్ఫాన్ ప‌ఠాన్

Hello Telugu - Tilak Varma Interesting Play

Hello Telugu - Tilak Varma Interesting Play

Tilak Varma : ఢిల్లీ : ఆసియా క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో ఒంటి చేత్తో పాకిస్తాన్ పై భార‌త జ‌ట్టును గెలిపించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌. ఓ ద‌శ‌లో 21 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో తిల‌క్ సంజూ శాంస‌న్ తో క‌లిసి 54 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. 24 ర‌న్స్ కు శాంస‌న్ అవుట్ అయ్యాక శివం దూబే తో క‌లిసి 64 ర‌న్స్ రెండో పార్ట‌న‌ర్ షిప్ ను జోడించాడు. దీంతో టీం ఇండియా విజ‌యం సులువుగా మారింది. ఆఖ‌రున మైదానంలోకి వ‌చ్చిన రింకూ సింగ్ సిక్స‌ర్ కొట్ట‌డంతో ఇండియా సూప‌ర్ స‌క్సెస్ సాధించింది. ఆసియా క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. ఇక తిల‌క్ వ‌ర్మ (Tilak Varma) చివ‌రి దాకా ఉన్నాడు. 69 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

Tilak Varma Interesting Play

ఈ సంద‌ర్బంగా భార‌త జ‌ట్టు విజ‌యంలో ముఖ్య భూమిక పోషించిన తిల‌క్ వ‌ర్మ‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. తాజా, మాజీ క్రికెట‌ర్లు త‌న‌ను అభినందించారు. ఈ సంద‌ర్బంగా మాజీ క్రికెట‌ర్, స్టార్ పేస‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ త‌న‌ను ఆకాశానికి ఎత్తేశాడు. తిల‌క్ వ‌ర్మ అద్భుతంగా ఆడాడ‌ని, త‌న ఆట తీరు పూర్తిగా విరాట్ కోహ్లీని పోలి ఉంద‌న్నాడు. పాకిస్తాన్ తో సేమ్ టు సేమ్ కోహ్లీని పోలి ఉండేలా త‌ను ఆడాడంటూ పేర్కొన్నాడు ప‌ఠాన్. ఎక్క‌డా ఎలాంటి టెన్ష‌న్ లేకుండా ఆడ‌డం అనేది టాప్ ప్లేయ‌ర్ల‌కే సాధ్యం అవుతుంద‌న్నాడు. ఇదిలా ఉండ‌గా భార‌త జ‌ట్టు సాధించిన విజ‌యాల‌లో కూడా తిల‌క్ వ‌ర్మ సూప‌ర్ షో చేశాడు.

Also Read : IND vs PAK- Tilak Varma Growth : ఇండియా-పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్‌లో మెరిసిన తెలుగు తేజం

Exit mobile version