Pomegranate Shocking Facts : ఆ సమస్యలు ఉన్నవారు దానిమ్మ అసలు ముట్టుకోకూడదు

కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలున్నవారు దానిమ్మ పండును తినడంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది...

Hello Telugu - Pomegranate Shocking Facts

Hello Telugu - Pomegranate Shocking Facts

Pomegranate : దానిమ్మ పండు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేస్తుందని తెలిసిందే. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో దీనిని “సూపర్ ఫుడ్” అని కూడా పిలుస్తారు. గుండె ఆరోగ్యం మెరుగుపరచడం, రక్త ప్రసరణను సక్రమం చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి అనేక లాభాలు ఉన్నప్పటికీ, అందరూ దీనిని నిరభ్యంతరంగా తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలున్నవారు దానిమ్మ (Pomegranate) పండును తినడంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Pomegranate – తక్కువ రక్తపోటు ఉన్నవారు

దానిమ్మలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన రక్తనాళాలు సడలుతాయి. దీని వల్ల రక్తపోటు తగ్గే అవకాశం ఉంది. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది లాభదాయకమైనా, తక్కువ రక్తపోటు (హైపోటెన్షన్) ఉన్నవారికి హానికరమవుతుంది. రక్తపోటు మరింత తగ్గి తలనొప్పి, మూర్ఛ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

శస్త్రచికిత్సకు ముందు జాగ్రత్త

శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నవారు కనీసం రెండు వారాల ముందుగానే దానిమ్మ (Pomegranate) పండును తినడం మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియను ప్రభావితం చేసి, శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తస్రావానికి దారితీసే ప్రమాదం ఉంది.

జీర్ణ సమస్యలు ఉన్నవారు

దానిమ్మలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే కడుపు సమస్యలతో బాధపడుతున్నవారు దీన్ని ఎక్కువగా తింటే ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి, విరేచనాలు వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఇలాంటి వారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని రకాల మందులు వాడేవారు

ACE ఇన్హిబిటర్లు, స్టాటిన్స్, బీటా-బ్లాకర్స్, బ్లడ్ థిన్నర్స్ వంటి మందులు వాడుతున్నవారు దానిమ్మ పండును జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే సమ్మేళనాలు మందుల ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఫలితంగా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

అలెర్జీ ఉన్నవారు

కొంతమందిలో దానిమ్మ పండు లేదా దాని రసం తీసుకున్నప్పుడు అలెర్జీ ప్రతిచర్యలు కనిపించవచ్చు. ముఖం లేదా గొంతులో వాపు, దురద, చర్మంపై దద్దుర్లు, శ్వాస సమస్యలు, తీవ్రమైన సందర్భాల్లో అనాఫిలాక్సిస్ కూడా సంభవించవచ్చు. ఇలాంటి ప్రతికూల ప్రభావాలు గమనించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం.

Also Read : Brinjal Shocking Facts : ఈ సమస్య ఉన్నవారు వంకాయ తింటే అంతే

Exit mobile version