బెంగళూరు : ప్రముఖ నటి, బిగ్ బాస్ -9 సీజన్ కంటెస్టెంట్, రన్నరప్ గా నిలిచిన తనూజ పుట్టస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో మరిచి పోలేని విజయం ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ షో అని పేర్కొంది. కొన్ని నెలలుగా ఈ షో మిమ్మల్ని ఆదరించింది. నవ్వించేలా చేసింది. అంతకు మించి వినోదాన్ని పంచింది. కొన్ని సార్లు ఇబ్బంది కూడా పెట్టింది. అయినా జీవితం అంటేనే సుఖ దుఖాఃల సమ్మేళనం. తాను విజేతగా నిలవాలని ఎందరో కోరుకున్నారు. బిగ్ బాస్ -9 గ్రాండ్ ఫినాలే ఓటింగ్ లో సైతం నాకు మద్దతుగా నిలిచారు. నాకు మనస్పూర్తిగా ఓటు వేసినందుకు ధన్యావాదాలు తెలియ చేసుకుంటున్నానని తెలిపింది తనూజ పుట్టస్వామి. మంగళవారం తను బెంగళూరులో మీడియాతో మాట్లాడింది. ఈ జర్నీ తనకు ఎన్నో నేర్పిందని చెప్పింది. తెలియని విషయాలను తెలుసుకునే ఛాన్స్ దక్కినందుకు హోస్ట్ నాగార్జునకు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని పేర్కొంది నటి.
ఇదే సమయంలో ఈ ప్రయాణం ఎప్పుడూ సులభం కాదని తనకు తెలుసు అని, కానీ అది ఎల్లప్పుడూ నిజమైనదని తాను భావిస్తానని స్పష్టం చేసింది. ఆ గోడల లోపల నేను నవ్వాను, ఏడ్చాను, పడి పోయాను, తిరిగి నిలబడ్డాను, ప్రతిసారీ బలంగా ఉండేందుకు నన్ను నేను సముదాయించుకున్నానని తనూజ పుట్టస్వామి చెప్పింది. అంతే కాదు నేను ప్రతి పనిని నిజాయితీగా ఆడాను. ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఈ సమయంలో పరిస్థితి ఎంత కఠినంగా మారినా నాకు నేను నిజాయితీగా ఉన్నాను. ఇదే తనకు చివరి దాకా సంతృప్తిని కలిగించిందని తెలిపింది. ఈ క్రమంలో మీ ప్రేమ నా నిశ్శబ్దాన్ని బలంగా మార్చింది. మీ ఓట్లు నా గొంతుగా మారాయి. మీ నమ్మకం నా అతిపెద్ద విజయంగా మారింది. బిగ్ బాస్ -9 ముగిసిందంటే నమ్మలేక పోతున్నాను. ఇది ముగింపు కాదు, ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది అని స్పష్టం చేసింది తనూజ పుట్టస్వామి.
