Heart Attack Risk : వీరికి రాత్రుళ్ళు ఎక్కువ గుండెపోటు వచ్చే ఛాన్స్

మందులు సమయానికి తీసుకోకపోతే ఈ ముప్పు రెండింతలు అవుతుందని హెచ్చరించారు...

Hello Telugu - Heart Attack Risk

Hello Telugu - Heart Attack Risk

Heart Attack : గుండె సంబంధిత సమస్యలు ఎప్పుడు వస్తాయో అంచనా వేయడం కష్టమే. అయితే, రాత్రిపూట గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కార్డియాలజిస్టు డా. డిమిట్రీ యారనావ్ తెలిపారు. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారు సరైన చికిత్స పొందకపోతే లేదా మందులు సమయానికి తీసుకోకపోతే ఈ ముప్పు రెండింతలు అవుతుందని హెచ్చరించారు.

Heart Attack Risk Facts

డాక్టర్ వివరించిన ప్రకారం, గుండె పోటు (Heart Attack) అకస్మాత్తుగా రాదు. తెల్లవారుజామున శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి గరిష్ఠానికి చేరుతుంది. దీంతో రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తపోటు పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో బీపీ రోగులకు గుండె పోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అదనంగా, షుగర్ నియంత్రణలో లేని రోగుల రక్తనాళాల్లో పేరుకున్న ప్లాక్‌లు ఈ సమయంలో మరింత ప్రమాదకరంగా మారతాయి. బీపీ మందులు వేసుకోవడం మర్చిపోయినా, తప్పు సమయంలో వేసుకున్నా ప్రమాదం అధికమవుతుందని ఆయన హెచ్చరించారు.

స్పెయిన్‌లో 19 వేల మంది రోగులపై జరిగిన అధ్యయనం ప్రకారం, రాత్రివేళ బీపీ మందులు వేసుకునే వారిలో గుండె పోటుతో సంబంధిత మరణాలు 50% వరకు తగ్గాయి. ఒకే ఔషధాన్ని ఉదయం, రాత్రి వేస్తే వేర్వేరు ఫలితాలు వస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు.

నిపుణులు సూచించిన దాని ప్రకారం, బీపీ ఔషధాలు రాత్రివేళ తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉండవచ్చని తేలింది. ఔషధాలు తీసుకునే విషయంలో నిర్లక్ష్యం చేయరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Also Read : Important Health Tips : రాత్రి 7 తర్వాత ఇవి తిన్నారంటే మీ పని అంతే

Exit mobile version