Important Health Tips : రాత్రి 7 తర్వాత ఇవి తిన్నారంటే మీ పని అంతే

రాత్రి 7 గంటల తర్వాత కొన్ని ఆహారాలను మానుకోవడం మంచిదని చెబుతున్నారు...

Hello Telugu - Important Health Tips

Hello Telugu - Important Health Tips

Health Tips : ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా రాత్రి భోజనంలో తీసుకునే పదార్థాలు శరీరానికి అనుకూలం కాకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి. నిపుణుల సూచనల ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత కొన్ని ఆహారాలను మానుకోవడం మంచిదని చెబుతున్నారు.

Health Tips – మటన్‌ బిర్యానీ:

రాత్రి వేళల్లో మటన్‌ బిర్యానీ తినడం ఆరోగ్యానికి మేలుకాదని వైద్యులు చెబుతున్నారు. చిన్న ప్లేట్‌లోనే 500–700 కేలరీలు ఉండటం వల్ల బరువు పెరగడం, కాలేయ సమస్యలు రావడం సాధ్యమవుతుంది.

Health Tips – కారం ఎక్కువున్న వంటకాలు:

స్పైసీ చికెన్‌, మటన్‌ కర్రీలు రాత్రిపూట తింటే కడుపులో మంట, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. వీటిలో ఎక్కువ నూనె, నెయ్యి ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది.

స్వీట్లు:

భోజనం తర్వాత స్వీట్లు తినడం అలవాటు ఉన్నవారు రాత్రి తర్వాత వీటిని మానుకోవాలి. రాత్రి 7 తర్వాత స్వీట్లు తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది నిద్రలో అంతరాయం కలిగించడమే కాక కడుపు సమస్యలకు దారితీస్తుంది.

బజ్జీలు, పకోడీలు:

సాయంత్రం స్నాక్స్‌గా ఇష్టపడే బజ్జీలు, పకోడీలు రాత్రిపూట తింటే గ్యాస్‌, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి ఇబ్బందులు వస్తాయి. వీటిలో ఉండే అధిక ఆమ్లత్వం జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, నిద్రలో ఆటంకం కలిగిస్తుంది.

కెఫిన్ పానీయాలు:

టీ, కాఫీ, గ్రీన్‌ టీ వంటి కెఫిన్‌ కలిగిన పానీయాలను సాయంత్రం 6 తర్వాత తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కెఫిన్‌ శరీరంలో జీర్ణక్రియను మందగింపజేయడంతో పాటు నిద్రకు భంగం కలిగిస్తుంది.

రాత్రిపూట తినే ఆహారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. తేలికపాటి, త్వరగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Also Read : Stock Market Rally Sensational : వరుసగా 5వ రోజు లాభాల్లో నడుస్తున్న స్టాక్ మార్కెట్

Exit mobile version