జ‌క్క‌న్న వార‌ణాసి మూవీ బ‌డ్జెట్ రూ. 1300 కోట్లు

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన న‌టి ప్రియాంక చోప్రా

hellotelugu-PriyankaChopra

ముంబై : ప్ర‌ముఖ న‌టి ప్రియాంక చోప్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ముఖ భార‌తీయ సినీ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి అలియాస్ జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భారీ బ‌డ్జెట్ చిత్రం వార‌ణాసి. ఇందులో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు ప్రిన్స్ మ‌హేష్ బాబు, అందాల బాలీవుడ్, హాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా. ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ కొన‌సాగుతోంది. హైద‌రాబాద్ లోని రామోజీ ఫిలిం స్టూడియోలో గ్రాండ్ గా గ్లింప్స్ రిలీజ్ చేశాడు ద‌ర్శ‌కుడు. భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజ‌ర‌య్యారు. హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉండ‌బోతోంద‌ని టాక్. ఈ సంద‌ర్బంగా ఇందులో ముఖ్య భూమిక పోషించిన న‌టి ప్రియాంక చోప్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. వార‌ణాసి జ‌క్క‌న్న మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ ఇచ్చింది. ఏకంగా ఈ సినిమా కోసం భారీ ఎత్తున ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు చెప్పింది. దాదాపు రూ. 1,300 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని తెలిపింది.

తాను బ‌డ్జెట్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నిర్మాణ స్థాయిని చూసి అంద‌రూ విస్తు పోయారు. తాను తాజాగా ప్ర‌ముఖ హోస్ట్ క‌పిల్ శ‌ర్మ షోలో పాల్గొంది. త‌ను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూల్ గా స‌మాధానం ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి స చిత్రం రెండు ఏళ్ల కింద‌ట ప్ర‌క‌టించాడు. ఆనాటి నుంచి ఏదో ఒక‌టి సినిమాకు సంబంధించి చ‌ర్చ‌ల్లో ఉంటూ వ‌స్తోంది. అలా చేస్తూ వచ్చాడు ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న‌. ఇది దక్షిణ భారత సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ చిత్రంగా రికార్డ్ నెల‌కొల్ప బోతోంద‌ని తెలిపింది ప్రియాంక చోప్రా. ఇక రాజ‌మౌళి సినీ కెరీర్ ప‌రంగా చూస్తే ఇదే ఎక్కువ ఖ‌ర్చు చేస్తున్న మూవీ కావ‌డం విశేషం. ఇక వార‌ణాసి చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ కూడా న‌టిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=LDaaWSE3I88

Exit mobile version