జ‌న నాయ‌గ‌న్ స్టోరీ రీమేక్ కాదు

స్ప‌ష్టం చేసిన ద‌ర్శ‌కుడు వినోత్

hellotelugu-HVinoth

చెన్నై : త‌మిళ సినీ రంగంలో సెన్సేష‌న్ క్రియ‌ట్ చేస్తోంది ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన చిత్రం జ‌న నాయ‌గ‌న్. మ‌లేషియాలోని కౌలాలంపూర్ లో జ‌రిగిన ఆడియో లాంచ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. 90 వేల‌కు పైగా ఫ్యాన్స్ హాజ‌ర‌య్యారు. తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. అదేమిటంటే జ‌న నాయ‌గ‌న్ చిత్రం క‌థ అస‌లైన‌ది కాద‌ని, రీమేక్ అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై తీవ్రంగా స్పందించారు ద‌ర్శ‌కుడు హెచ్ . వినోత్. సోమ‌వారం ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని, కొంద‌రు కావాల‌ని దుష్ప్ర‌చారం చేయ‌డం త‌గ‌ద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్త‌యింద‌ని, ఈ త‌రుణంలో ఇలాంటి వార్త‌లు రావ‌డాన్ని జీర్ణించుకోలేక పోతున్నామ‌ని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా జ‌న నాయ‌గ‌న్ కు సంబంధించి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ద‌ర్శ‌కుడు హెచ్. వినోత్.
రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టడానికి ముందు విజయ్ నటించిన చివరి చిత్రం కావ‌డం తో భారీ ఎత్తున అంచనాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించాడు. వ‌చ్చే జ‌న‌వ‌రి 9వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తామ‌ని తెలిపాడు ద‌ర్శ‌కుడు . ఇక ఊహాగానాల‌కు తెర దించాల‌ని సూచించాడు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారో, ద‌ళ‌ప‌తి విజ‌య్ కు ఉన్న ల‌క్ష‌లాది మంది ఫ్యాన్స్ కు కావాల్సిన స‌రంజామా అంతా జ‌న నాయ‌గ‌న్ లో ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశాడు. ఇప్ప‌టికే కోట్లాది రూపాయల మార్కెట్ జ‌రుగుతోంది ఈ మూవీపై.

Exit mobile version