తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం : బండారు శ్రావ‌ణి

అనంత‌పురం పార్ల‌మెంట్ టీడీపీ క‌మిటీ ప్రమాణ స్వీకారం

Hellotelugu-BandaruSravaniSree

అనంత‌పురం జిల్లా : టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీకి కార్య‌క‌ర్త‌లే అస‌లైన బ‌లం అని అన్నారు. అనంతపురం లోని రామ్‌నగర్‌ కమ్మ భవన్‌లో అనంతపురం పార్లమెంట్ టీడీపీ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ , అనంతపురం జిల్లా ఎమ్మెల్యే అష్మిత్ రెడ్డి , దగ్గుపాటి ప్రసాద్ , గుమ్మనూరు జయరాం , ఇతర జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ ప్ర‌సంగించారు. దేశ రాజకీయ పార్టీలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంద‌న్నారు. జాతీయ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వంలో కోటి మందికి పైగా సభ్యులు ఉండటం దేశ రాజకీయాల్లో ఒక సంచలనం అని అన్నారు.

కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి, కార్యకర్తల పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాల కోసం ఆర్థిక సహాయం అందించడం జ‌రిగింద‌న్నారు బండారు శ్రావ‌ణి శ్రీ‌. సహజ మరణాలు. ప్రమాదాలలో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించింద‌న్నారు. జిల్లా టీడీపీ కమిటీ సభ్యులు రాబోయే స్థానిక ఎన్నికలలో అందరినీ సమన్వయం చేసుకుని, వారికి భారీ విజయాన్ని అందించార‌ని అన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికలలో కూటమిని అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేయాలని అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా టీడీపీ కమిటీ అధ్యక్షులు నాగరాజుకి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి , ఇతర జిల్లా కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Exit mobile version