బెంగళూరు : పాన్ ఇండియా హీరో యశ్ సంచలనంగా మారాడు. తను కీ రోల్ పోషించిన మూవీ టాక్సిక్ పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇంకా విడుదల కాకుండానే సెన్సేషన్ క్రియేట్ చేసింది సినీ పరిశ్రమను. దీనిని పాన్ ఇండియా లెవల్ లో చిత్రీకరించారు దర్శకురాలు గీతూ మోహన్ దాస్. గ్లామర్, యాక్షన్, థ్రిల్లర్ , తదితర అన్ని హంగులను కలిపి తెరకెక్కించింది. వాస్తవానికి జూలై నెలలోనే విడుదల కావాల్సి ఉంది టాక్సిక్. కానీ పశ్చిమ ఆసియాలో యుద్ద వాతావరణం నెలకొనడంతో అమెరికా, తదితర దేశాలలో చోటు చేసుకున్న అనిశ్చితి కారణంగా టాక్సిక్ ను వాయిదా వేశారు. ప్రస్తుతం విడుదల చేసిన ప్రోమో, ట్రైలర్ దుమ్ము రేపుతోంది. సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఇక ఇప్పటికే కేజీఎఫ్ తో రికార్డుల మోత మోగించిన యశ్ ఇప్పుడు గ్యాప్ తర్వాత టాక్సిక్ తో సందడి చేసేందుకు రానున్నాడు.
అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని , ఆనందాన్ని ఇచ్చేందుకు రెడీ అయినట్లు చిత్ర దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పేర్కొన్నారు. దీంతో మరింత అంచనాలు పెంచేలా చేసింది టాక్సిక్. కన్నడ సినిమాకు సంబంధించి అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకదాన్ని అందించిన తర్వాత, యష్ తన ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామా టాక్సిక్‌తో తిరిగి రావడానికి ముందు సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. ఇది ఆగస్టు 26న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం తాజా ప్రచార వీడియో గణనీయమైన సందడిని సృష్టించింది, దృశ్యపరంగా ఆకట్టుకునే, రెట్రో-గోతిక్ ఘట్టాల ద్వారా దానిలోని ప్రధాన మహిళా పాత్రలను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.



















