Devineni Uma Interesting Comments : అరుదైన నాయ‌కుడు స‌ర్దార్ గౌతు ల‌చ్చ‌న్న

కొనియాడిన మాజీ మంత్రి దేవినేని ఉమ

Hello Telugu - Devineni Uma Interesting Comments

Hello Telugu - Devineni Uma Interesting Comments

Devineni Uma : ఎన్టీఆర్ జిల్లా – అరుదైన‌, విల‌క్ష‌ణ‌మైన నాయ‌కుడు స‌ర్దార్ గౌతు ల‌చ్చ‌న్న అన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ‌. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదాంకితులు, బడుగు, బలహీన వర్గాల, రైతాంగ సమస్యల కోసం నిరంతరం పోరాడిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో లచ్చన్న చిత్రపటానికి మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా మహేశ్వరరావు (Devineni Uma) స్థానిక నేతలతో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

Devineni Uma Praises Gouthu Latchanna

ఈ సందర్భంగా మాట్లాడారు. సర్దార్ గౌతు లచ్చన్న సేవలకు గుర్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారన్నారు. భారతదేశంలో వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి ఆయ‌న అన్నారు.. ఐదు సార్లు శాసనసభ్యుడుగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా ఆయన ప్రజలకు నిరూపమానమైన సేవలందించారని కొనియాడారు. తాను నమ్మిన సిద్దాంతం కోసం పదవులను సైతం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి లచ్చన్న అన్నారు. తన రాజకీయ గురువు ఎన్‌జి రంగా గారి కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశారు అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికై శ్రీకాకుళం నుండి మద్రాస్ వరకు పాదయాత్ర చేశారని, శాసనసభలో తన వాగ్దాటితో గ్రామీణ ప్రాంత ప్రజల, రైతుల తరఫున గిట్టుబాటు ధరల కోసం అలుపెరగని పోరాటం చేశారు అని తెలిపారు. మద్రాసు నుండి విడిపోయిన సమయంలో మనకు రావలసిన వాటాలు, హక్కులపై సభలో సమర్థవంతంగా మాట్లాడి తనవంతు పాత్ర పోషించారు అని ప్ర‌శంసించారు. లచ్చన్న కుమారుడు శివాజీ కూడా మూడు దశాబ్దాలు ఆ ప్రాంతంలో ప్రజల మద్దతు పొంది ప్రజాప్రతినిధిగా పనిచేశారని గుర్తు చేవారు. ఆయన మనవరాలు గౌతు శిరీష ప్రతిపక్షంలో పోరాడిన తీరు.. నేడు శాసనసభలో పోరాడుతున్న తీరు ఆయన ఇచ్చిన స్ఫూర్తికి నిదర్శనం అన్నారు. ల‌చ్చ‌న్న‌ ఇచ్చిన స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందనీ పేర్కొన్నారు.

Also Read : Hero Rajinikanth Birthday : స్వర్ణోత్సవ సూపర్ స్టార్ రజినీకాంత్

Exit mobile version