హైదరాబాద్ : జర్నలిజం రంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు కేంద్రంలోని బీజేపీ కూటమి మోదీ సర్కార్ డీపీడీపీ చట్టాన్ని తీసుకు వచ్చింది. దీనిని సవాల్ చేస్తూ డిజిటల్ న్యూస్ ఆర్గనైజేషన్స్ అసోసియేషన్ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్తానం సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన “డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్” చట్టం జర్నలిస్టులను అణచి వేసేందుకు పన్నిన కుట్ర అని, ఇది జర్నలిజాన్ని సజీవంగా పాతిపెడుతుందని ఆరోపించింది దాఖలు చేసిన దావాలో ఈ పిటిషన్‌లో ఎన్‌డిటివి, దానికి అనుబంధంగా ఉన్న న్యూస్ 18 కూడా భాగస్వాములు కావడం గమనార్హం.
ఈ చట్టంపై తాము ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని, కేంద్ర ప్రభుత్వ వివరణ వినాలని కోర్టు పేర్కొంది. కేంద్ర న్యాయ శాఖ, ఎలక్ట్రానిక్స్ , సమాచార శాఖలకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. గత చట్టాలలో జర్నలిస్టులకు మినహాయింపులు ఉన్నాయని, ఈ చట్టంలో వాటిని ఎందుకు కల్పించలేదని డిజిటల్ న్యూస్ ఆర్గనైజేషన్స్ అసోసియేషన్ ప్రశ్నించింది. డిపిడిపి చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం, నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ. 250 కోట్ల జరిమానా విధించడంతో జర్నలిస్టులు కేంద్రాన్ని ప్రశ్నించారు: ఏదైనా అవినీతిని బయట పెట్టే ముందు నిందితుల అనుమతి తీసుకోవాలా? అని కూడా కోరింది. ఇక చట్టం విషయానికి వస్తే భారతదేశంలో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి రూపొందించిన చట్టమే డిపిడీపి 2023 చట్టం. . ఈ చట్టం ప్రకారం వ్యక్తుల డిజిటల్ సమాచారాన్ని సేకరించే సంస్థలు, వెబ్‌సైట్లు, యాప్‌లు ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా భద్రపరచాలి అనే అంశాలకు నిబంధనలు వర్తిస్తాయి.
