రూ. 63 ల‌క్ష‌లు కోల్పోయిన డైరెక్ట‌ర్ కొడుకు

న‌కిలీ ట్రేడింగ్ వ్య‌వ‌హారంలో మ‌రో మోసం

hellotelugu-AmitovTeja

హైద‌రాబాద్ : సైబ‌ర్ మోసానికి బ‌ల‌వుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నిన్న‌టికి నిన్న సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ ల‌క్ష్మీనారాయ‌ణ భార్య ఏకంగా అత్యాసకు పోయి రూ. 2.60 కోట్ల‌కు పైగా మోస పోయింది. తాజాగా మ‌రో న‌కిలీ ట్రేడింగ్ దెబ్బ‌కు ఏకంగా టాలీవుడ్ లో మోస్ట్ ఫేవ‌ర‌బుల్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందిన తేజ త‌నయుడు కూడా దీని బారిన ప‌డ్డాడు. దాదాపు రూ. 63 ల‌క్ష‌లు కోల్పోయాడు. ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు ద‌ర్శ‌కుడు. అనూష, ప్రణీత్ అనే హైదరాబాద్‌కు చెందిన దంపతులు, తాము అనుభవజ్ఞులైన స్టాక్ మార్కెట్ నిపుణులమని పరిచయం చేసుకున్నారు డైరెక్ట‌ర్ కొడుకుతో.
ట్రేడింగ్ ద్వారా అధిక రాబడిని ఇప్పిస్తామని వాగ్దానం చేశారు. బాధితుడి నమ్మకాన్ని చూరగొనడానికి, నిందితులు నకిలీ లాభాల స్టేట్‌మెంట్‌లను చూపించారు. గణనీయమైన లాభాలు వస్తాయని అతనికి హామీ ఇచ్చారు.

అయితే వారిని డైరెక్ట‌ర్ కొడుకు గుడ్డిగా నమ్మాడు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పటికీ, అతనికి వాగ్దానం చేసిన లాభాలు రాక పోగా పూర్తిగా త‌ను పెట్టిన డ‌బ్బుల‌న్నీ మోస పోయిన‌ట్లు గుర్తించాడు. దీంతో త‌ను మోస పోయిన విష‌యం గురించి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. వారిపై ఫిర్యాదు చేశాడు. అయితే డైరెక్ట‌ర్ తేజ త‌న‌యుడు అమితోవ్ తాను సంపాదించిన డ‌బ్బుల నుంచే పెట్టుబ‌డిగా పెట్టాడ‌ని, ట్రేడింగ్ లో మోసానికి గురైన‌ట్లు తేలింది. కాగా ద‌ర్శ‌కుడు తేజ నుంచి ఒక్క పైసా తీసుకోలేద‌ని కానీ తాను సంపాదించిన దాంట్లోంచి కోల్పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

Exit mobile version