ఏపీలో కూటమి పాల‌న ప్ర‌జ‌ల‌కు ఆలంబ‌న

టీడీపీ జాతీయ ఉపాధ్య‌క్షుడు రాజేంద్ర‌ప్ర‌సాద్

hellotelugu-YVBRajendraPrasad

అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షుడు వైవిబి రాజేంద్ర‌ప్ర‌సాద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీల‌లో కూటమి పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇటీవల నూతనంగా తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన కమిటీలలో తెదేపా జాతీయ ఉపాధ్యక్షులుగా రాజేంద్రప్రసాద్ ని నియ‌మించారు. ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియ చేశారు బ్రాహ్మణ సంఘం నాయకులు . ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కూటమి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు భయభ్రాంతులకు గురై బిక్కు బిక్కు మంటూ జీవించారని అన్నారు.

కానీ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక సీన్ మారింద‌ని చెప్పారు. అన్ని వ‌ర్గాల‌కు సంక్షేమ ఫ‌లాలు అందుతున్నాయ‌ని, దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమం విష‌యంలో ఏపీ నెంబ‌ర్ వ‌న్ గా ఉంద‌న్నారు రాజేంద్ర ప్ర‌సాద్. రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు బ్రాహ్మణ సంఘం నాయకులు చోడవరపు బాపిరాజు, గంట పుల్లేశ్వరరావు, వేమూరి పూర్ణచంద్రరావు, గోవిందరాజు వేణుమాధవ్, చోడవరపు దుర్గాప్రసాద్, ఘంటసాల వెంకటేశ్వరరావు, కొలసాని సీతారామయ్య, 10,12, 5 వార్డుల యువత నాయకులు బూరెల నరేష్, బూరెలా రవి, కల్లూరి కిరణ్, పాశల కన్నారావు, గేదల పవన్, ఆవుల శర్మ, డబ్బడా బాల ,ఉక్కుడి వేంకటేష్, తిరుమల విరాస్వమి, పండు, సాయి, వీరబాబు, గిరిడి వెంకటేష్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version