హైదరాబాద్ : దుర్గం చెరువు ఆక్రమించుకుంటున్నట్లు తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియతో మాట్లాడారు తెలంగాణ భవన్ లో. దుర్గం చెరువులో తాము 5 ఎకరాల భూమి కబ్జా చేశాను అని కేసు పెట్టారని ఇందులో ఒక్క గజం కూడా తాము కబ్జాకు పాల్పడ లేదని స్పష్టం చేశారు. ఇదంతా కేవలం రాజకీయ దురుద్దేశంతో కావాలని ఇరికించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్ కు సంబంధించి ఇక్కడ గజం స్థలం కూడా లేదన్నారు. అక్కడ అందరూ వాహనాల పార్కింగ్ పెట్టుకుంటారని, అంతేకాకుండా అక్కడే ఖాళీ స్థలంలో చెత్త డంప్ చేస్తారని చెప్పారు కొత్త ప్రభాకర్ రెడ్డి.
విచిత్రం ఏమిటంటే కావాలని కేసు పెట్టారని ఆరోపించారు. ఒకవేళ తాము కబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు చేస్తున్న వాళ్లు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కావాలని అక్రమ కేసు బనాయించారని మండిపడ్డారు. న్యాయ పరంగా తాము ఎదుర్కొంటామని చెప్పారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. నటుడు , ఎమ్మెల్యే బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు పక్కనే ఉన్నాయన్నారు. దుర్గం చెరువులో నాకు భూమి లేదు.. ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రోడ్డు మీద, చెట్ల కింద వెహికిల్ పార్కింగ్ చేసినందుకు కేసు పెట్టారంటూ మండపడ్డారు.
