మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి భగీరథ్ పటేల్ రేప్ కేసు వ్యవహారం. దీంతో సభ్య సమాజం తల దించుకునేలా ఈ వ్యవహారం చోటు చేసుకున్నా నిస్సిగ్గుగా తన తనయుడు తప్పు చేయలేదంటూ బుకాయించే ప్రయత్నం చేశారు కేంద్ర మంత్రి. గత్యంతరం లేక బాధితురాలు, తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు వచ్చారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచిత్రం ఏమిటంటే ఖాకీలు బాధితులపై కూడా కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని డిజిటల్ మీడియా, ప్రజాస్వామ్య కార్యకర్తలు, పౌర సమాజం మొత్తం ఒక్కటై బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాల్సిందేనని పట్టు పట్టింది. ఇదే క్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. తను ఆధారాలతో సహా బయట పెట్టాడు. ఎలా బెదిరింపులకు గురి చేశాడనే దాని గురించి పూసగుచ్చినట్లు వివరించాడు.
గత్యంతరం లేక కేంద్ర మంత్రి కొడుకును ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. శనివారం తనకు పరీక్షలు ఉన్నాయని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పోక్సో కేసులో అరెస్ట్ అయి, జైల్లో ఉన్న బండి భగీరథ్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది మల్కాజిగిరి కోర్టు. సెమిస్టర్ పరీక్షలు ఉన్నందున పరీక్షలకు హాజరయ్యేందుకు అతనికి తాత్కాలిక బెయిల్ ఈ నెల 26 వరకు మంజూరు చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం గత నెల 16న పోక్సో కేసులో భగీరథ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.. గత నెల9న కేసు నమోదు తర్వాత అరెస్ట్ భయంతో పరారయ్యాడు భగీరథ్. .ముందస్తు బెయిల్.. లేదా అరెస్ట్ తరువాత మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ తన న్యాయవాదుల ద్వారా హై కోర్టు ను ఆశ్రయించాడు.. అయితే ఈ పిటిషన్ ను విచారించిన హై కోర్టు వెకేషన్ కోర్టు.. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
