హైదరాబాద్ : తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్ )కు శ్రీకారం చుట్టామన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి. శనివారం శనివారం హైదరాబాద్‌లోని బి.ఆర్.కె.ఆర్. భవన్‌లో ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణస కార్యక్రమంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఓటర్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అని స్పష్టం చేశారుఓటర్ల జాబితాలో ఖచ్చితత్వాన్ని , విశ్వసనీయతను కాపాడేందుకు భారత ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపట్టిందని సీఈఓ వివరించారు. నకిలీ , అనర్హమైన నమోదులను తొలగించడం, మరణించిన ఓటర్ల పేర్లను తొలగించడం, అర్హులైన ప్రతి పౌరుడి పేరును ఓటర్ల జాబితాలో చేర్చడం ఈ ప్రక్రియ లక్ష్యం అని చెప్పారు. ఎన్నికల సంఘం ప్రకారం ఈ సర్ ప్రక్రియ జూన్ 25 న ప్రారంభం అవుతుందని, వచ్చే అక్టోబర్ 1 నాటితో ముగుస్తుందని చెప్పారు సీఈఓ.
ఈ సవరణ ప్రక్రియ పలు దశల్లో జరుగుతుందని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే కార్యక్రమం నిర్వహిస్తారని, జూలై 31, 2026న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. ఆ తర్వాత జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు , క్లెయిమ్‌ల స్వీకరణ జరుగుతుందని చెప్పారు. అక్టోబర్ 1న తుది జాబితా ప్రచురణకు ముందు, సెప్టెంబర్ 28 వరకు పరిశీలన, విచారణ , క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ, బూత్ స్థాయి అధికారులు (BLOs) ప్రతి ఇంటిని సందర్శించి, ముందే ముద్రించిన వివరాల సేకరణ పత్రాలను (Enumeration Forms) అందజేస్తారని సీఈఓ తెలిపారు. గరిష్ట స్థాయిలో ప్రజలను చేరుకునేందుకు ప్రతి BLO కనీసం మూడు సార్లు ఆయా ఇళ్లను సందర్శిస్తారని అన్నారు. ఓటర్లు ఆ పత్రాలను నింపి తదుపరి సందర్శనల సమయంలో అంద జేయవచ్చు లేదా ఎన్నికల సంఘం కల్పించిన ఆన్‌లైన్ సదుపాయాన్ని ఉపయోగించు కోవచ్చని పేర్కొన్నారు సీఈఓ.
వివరాల సేకరణ పత్రం అందని ఓటర్లు BLO ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా దానిని పొందవచ్చని తెలిపారు. పత్రం నింపడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే, BLOలు తమ సందర్శనల సమయంలో తగిన సహాయం అందిస్తారని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ సేవల లభ్యతపై ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. ఓటర్లు తమ పేర్లు 2002 ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో సరిచూసుకోవచ్చు, తల్లిదండ్రులు లేదా తాతామామ్మల వివరాలను వెతుక్కోవచ్చు. ఎన్నికల సంఘం పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో గణన పత్రాలను సమర్పించవచ్చు. తమ నివాసానికి దూరంగా నివసిస్తున్న, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తున్న, లేదా విదేశాల్లో నివసిస్తున్న ఓటర్లకు సహాయ పడటానికి ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని ప్రవేశ పెట్టామన్నారు.
