మ‌లేషియాలో ఘ‌నంగా జ‌న నాయ‌గ‌న్ ఆడియో లాంచ్

భారీ సంఖ్య‌లో హాజ‌రైన ద‌ళ‌ప‌తి విజ‌య్ ఫ్యాన్స్

hellotelugu-janaNayagan

మ‌లేషియా : త‌మిళ సినీ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొంద‌ని న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్. త‌ను న‌టించిన చిత్రం జ‌న నాయ‌గ‌న్. త‌న సినీ కెరీర్ లో ఇదే ఆఖ‌రి చిత్రం అని ఇప్పటికే ప్ర‌క‌టించాడు. దీంతో ఈ మూవీపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. త‌ను అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ స్వంతంగా టీవీకే పేరుతో పార్టీని స్థాపించాడు. ప్ర‌చారం కూడా ప్రారంభించాడు. కానీ క‌రూర్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న త‌న‌పై తీర‌ని మ‌చ్చ ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 41 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదే స‌మ‌యంలో కేసు కూడా న‌డుస్తోంది. 2026లో రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెట్టాడు విజ‌య్. దీంతో ఇక సినిమాల‌లో న‌టించ బోనంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు.

ఇక మూవీ కెరీర్ ప‌రంగా చూస్తే త‌న‌కు జ‌న నాయ‌గ‌న్ చిత్రం 69వ‌ది. భారీ ఎత్తున ఫ్యాన్స్ అవుతార‌ని భావించిన త‌ను ఉన్న‌ట్టుండి జ‌న నాయ‌గ‌న్ మూవీకి సంబంధించిన ఆడియో లాంచింగ్ ఈవెంట్ ను మ‌లేషియాలో ప్లాన్ చేశాడు. కౌలాలంపూర్ లో భారీ ఎత్తున కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న త‌న అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అశేషమైన ఫ్యాన్స్ మ‌ధ్య గ్రాండ్ గా లాంచ్ చేశారు సినిమా ఆడియోను. హెచ్. వినోత్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో పూజా హెగ్డే , బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=F_dvC8PZbDE

Exit mobile version