TG High Court Approved : నెక్కొండ మున్సిపాలిటీకి హై కోర్టు గ్రీన్ సిగ్నల్

పిటిష‌న్ దాఖ‌లు చేసిన మాజీ స‌ర్పంచ్

Hello Telugu - TG High Court Approved

Hello Telugu - TG High Court Approved

TG High Court : హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు (TG High Court) కీల‌క తీర్పు వెలువ‌రించింది. తెలంగాణ లో మ‌రో మున్సిపాలిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు దాఖ‌లైన పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టింది కోర్టు. ఇందులో భాగంగా తెలంగాణలో మరొక మున్సిపాలిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చాలని లంచ్ మోషన్ పిటిషన్ వేశారు నెక్కొండ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమున రెడ్డి. నెక్కొండ, అమీన్ పేట, గుండ్రపల్లి, పత్తిపాక, నెక్కొండ తండా, టీ.కె తండా గ్రామ పంచాయితీలను కలిపి మున్సిపాలిటీగా చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.

TG High Court Agreed

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో వెంటనే నోటిఫికేషన్ కు ముందే నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా గుర్తించాలని స్ప‌ష్టం చేసింది హైకోర్టు. లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ ఈసీని హెచ్చ‌రించింది. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించాలంటే క‌నీసం మున్సిపాలిటీ ఉండాల‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సిద్ద‌మైంది. ఇప్ప‌టికే స‌ర్కార్ నుంచి, హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించ‌డంతో రేపు గురువారం నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. డిసెంబ‌ర్ 11న పోలింగ్ జ‌రుగుతుంది. అదే రోజు ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌నుంది ఈసీ.

Also Read : T Rajaiah Shocking Comments on Kadiyam : పార్టీలు మార‌డం క‌డియంకు అల‌వాటే

Exit mobile version