TG Govt Important Visit to SC : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై సుప్రీంకోర్టుకు స‌ర్కార్

జీవో నెంబ‌ర్ 9పై స్టే ఇచ్చిన హైకోర్టు

Hello Telugu - TG Govt Important Visit to SC

Hello Telugu - TG Govt Important Visit to SC

TG Govt : హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన 42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది తెలంగాణ (TG Govt) రాష్ట్ర హైకోర్టు. నాలుగు వారాల త‌ర్వాత ఈ కేసుపై తుది తీర్పు వెలువ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించారు జ‌స్టిస్ విజ‌య్ సేన్ రెడ్డి. తాత్కాలికంగా స‌ర్కార్ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాల‌ని నిర్ణ‌యించింది. రిజ‌ర్వేష‌న్ల‌పై ఇంకా తుది తీర్పు ఇవ్వ‌క పోయినప్ప‌టికీ రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించు కోవ‌చ్చంటూ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు తీర్పు కాపీని స‌ర్కార్ కు పంపించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో నెంబర్ 9పై స్టే ఇవ్వ‌డాన్ని తప్పు ప‌ట్టారు బీసీ సంఘం నాయ‌కులు, మేధావులు, ప్ర‌జా సంఘాలు.

TG Govt Approach Supreme Court

ఇదిలా ఉండ‌గా ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రభుత్వం తరపున ఢిల్లీకి మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్, వాకిటి శ్రీ‌హ‌రిని పంపే ఆలోచనలో ఉన్నారు. వీరితో పాటు పార్టీ తరపున టీపీసీసీ మహేష్ గౌడ్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంద‌ని స‌మాచారం.ఈ సంద‌ర్బంగా అనుసరించాల్సిన వ్యూహం, వినిపించాల్సిన వాదనలపై చర్చించారు. ఇక గ‌తంలో నిర్వ‌హించిన కీల‌క భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Also Read : Pakistan Shocking Notices : ఆఫ్గనిస్తాన్ రాయ‌బారికి పాకిస్తాన్ స‌మ‌న్లు

Exit mobile version