Pakistan Shocking Notices : ఆఫ్గనిస్తాన్ రాయ‌బారికి పాకిస్తాన్ స‌మ‌న్లు

ప‌హ‌ల్గామ్ దాడిని ఖండించిన ఆఫ్గ‌నిస్తాన్

hellotelugu-pakistansummons

Pakistan : పాకిస్తాన్ : భార‌త దేశంతో స‌త్ సంబంధాల‌ను పెంపొందించేందుకు ఆఫ్గ‌నిస్తాన్ దేశం ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ప్ర‌స్తుతం ఇండియాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా ఇండియాలోని జ‌మ్మూ కాశ్మీర్ పహ‌ల్గామ్ ఘ‌ట‌న గురించి ప్ర‌స్తావించారు. ఈ ఘ‌ట‌న‌లో పాకిస్తాన్ (Pakistan) ప్రేరేపిత ఉగ్ర‌వాదులు 26 మందిపై కాల్పులు జ‌రిపారు. యావ‌త్ ప్ర‌పంచం త‌ప్పు ప‌ట్టింది. దీంతో భార‌త దేశం యుద్దం ప్ర‌క‌టించింది. ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో అటాక్ చేసింది. చివ‌ర‌కు పాకిస్తాన్ కాళ్ల బేరానికి వ‌చ్చింది. వార్ ను ఆపేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. ఈ త‌రుణంలో ఇండియాలో ప‌ర్య‌టిస్తున్న ఆఫ్గన్ విదేశాంగ శాఖ మంత్రి పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించారు.

Pakistan Shocking Notices to Afghanistan

న్యూఢిల్లీలో ఒక రోజు ముందు విడుదల చేసిన భారతదేశం-ఆఫ్ఘనిస్తాన్ ఉమ్మడి ప్రకటనపై తన బలమైన అభ్యంతరాలను తెలియ జేయడానికి పాకిస్తాన్ ఆఫ్ఘన్ రాయబారిని పిలిపించింది. న్యూఢిల్లీకి చేరుకున్న ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఆరు రోజుల పర్యటనలో ఉన్నారు. సంయుక్త ప్రకటనలో జమ్మూ కాశ్మీర్ గురించి చేసిన సూచనలకు సంబంధించి ఆఫ్ఘన్ రాయబారికి పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరాలను అదనపు విదేశాంగ కార్యదర్శి తెలియజేసినట్లు విదేశాంగ కార్యాలయం తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో భాగంగా పేర్కొనడం సంబంధిత ఐక్య రాజ్య స‌మితి భద్రతా మండలి తీర్మానాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది పాకిస్తాన్.

Also Read : CM Revanth Reddy Interesting Comments : ఐటీ కంపెనీల‌కు కేంద్రం రాయ‌దుర్గం : సీఎం

Exit mobile version