TG Education Dept : హైదరాబాద్ – తెలంగాణ సర్కార్ కు విద్యా శాఖ (TG Education Dept) కీలక ప్రతిపాదన చేసింది. ఈ మేరకు పూర్తి ఫైల్ ను పంపించింది. ఇప్పటికే విశిష్ట సేవలు అందిస్తున్నారు సమగ్ర సర్వ శిక్ష అభియాన్ కింద పని చేస్తున్న ఉద్యోగులు. వీరంతా కాంట్రాక్టు కింద పని చేస్తున్న వారే. గతంలో డీఎస్సీ పరీక్షలో వెయిటేజీ ప్రతిపాదన వచ్చింది. దీని కారణంగా కేజీబీవీ, ఎస్ఎస్ఏ కాంట్రాక్టు కింద పని చేస్తున్న టీచర్లకు ప్రయోజనం చేకూరనుంది.
TG Education Dept Key Update
ఇందులో భాగంగా తెలంగాణ పాఠశాల విద్యా శాఖ రాబోయే జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ఉపాధ్యాయ నియామకంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) , సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు సవరించిన వెయిటేజ్ విధానాన్ని సూచించింది. దీని వల్ల దాదాఉ 10,000 మంది ప్రయోజనం చేకూరుతుంది.
ప్రతిపాదన ప్రకారం, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు వారి ప్రాంతం, పని చేస్తున్న కాలాన్ని బట్టి మార్కులను నిర్ణయిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో పని చేసే వారికి సంవత్సరానికి 1.5 మార్కులు, పట్టణ ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి 1.3 మార్కులు , జీహెచ్ఎంసీ ప్రాంతంలో పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు.
అయితే ఆరున్నర ఏళ్లు పని చేసే గ్రామీణ ప్రాంతంలో టీచర్ కు పూర్తి మార్కులు లభించనున్నాయి. కాగా పట్టణ ప్రాంతంలో పని చేసే వారికి కనీసం 8 ఏళ్లు పూర్తయి ఉండాలి. జీహెచ్ఎంసీలో పని చేస్తున్న వారి సర్వీస్ 10 ఏళ్లు పని చేయాల్సి ఉంటుంది. పూర్తిగా హెచ్ ఆర్ఏ ఆధారంగా నిర్ణయించింది విద్యా శాఖ.
Also Read : Minister Savitha Shocking Comments : తెలుగుదేశం అధిష్టానం నిర్ణయమే ఫైనల్ – సవిత
