Temba Bavuma Shocking Comments : స‌మిష్టిగా ఆడాం భార‌త్ పై గెలుపొందాం

ద‌క్షిణాఫ్రికా టెస్టు జ‌ట్టు స్కిప్ప‌ర్ టెంబా బావుమా

Hello Telugu - Temba Bavuma Shocking Comments

Hello Telugu - Temba Bavuma Shocking Comments

Temba Bavuma : కోల్ క‌తా : కోల్ క‌తా వేదిక‌గా ప‌టిష్ట‌మైన భార‌త జ‌ట్టుతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్ లో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది ప‌ర్యాట‌క జట్టు ద‌క్షిణాఫ్రికా. ఇప్ప‌టికే ఈ జ‌ట్టు టెస్టు ఛాంపియ‌న్ గా అవ‌త‌రించింది. అది టెంబా బావుమా (Temba Bavuma) సార‌థ్యంలో. చూస్తే చిన్నోడు కానీ మహా గ‌ట్టోడు. త‌న శ‌క్తి యుక్తుల ముందు ఏ జట్టూ ప‌నికిరాదు. ప్ర‌స్తుతం టీం ఇండియాకు శుభ్ మ‌న్ గిల్ కెప్టెన్ కాగా త‌ను అనుకోకుండా గాయ‌ప‌డ్డారు. దీంతో స్టాండింగ్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు రిషబ్ పంత్. 30 ప‌రుగుల తేడాతో భార‌త జ‌ట్టును ఓడించింది ద‌క్షిణాఫ్రికా. అత్యంత త‌క్కువ స్కోర్ . కానీ దానిని కూడా ఛేదించ‌లేక చ‌తికిల‌ప‌డ్డారు. మ్యాచ్ లో విజ‌యం సాధించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు స‌ఫారీ జ‌ట్టు స్కిప్ప‌ర్ టెంబా బావుమా.

South Africa Skipper Temba Bavuma Comments

క‌లిసిక‌ట్టుగా ఆడామ‌ని అందుకే తాము విజ‌యం సాధించ‌డం జ‌రిగింద‌న్నాడు . ఈ గెలుపులో అత్య‌ధికంగా క్రెడిట్ ఇవ్వాల్సింది త‌మ జ‌ట్టు బౌల‌ర్ల‌కు అన్నాడు. భార‌త్ జ‌ట్టు ముందు స్వ‌ల్ప‌మైన ల‌క్ష్యం మాత్ర‌మే ఉంది. ఎవ‌రైనా స‌రే స‌క్సెస్ సాధిస్తామ‌ని అనుకుంటారు. కానీ త‌మ బౌల‌ర్లు భార‌త బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. వారిని ప‌రుగులు చేయ‌నీయ‌కుండా క‌ట్ట‌డి చేశారు. దీంతో త‌మ ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు తంటాలు ప‌డ్డార‌ని పేర్కొన్నాడు టెంబా బావుమా. మొద‌టి మూడు రోజుల్లోనే ఆట‌పై పూర్తి ప‌ట్టు సాధించ‌డం జ‌రిగింద‌న్నాడు. ఇదంతా త‌మ జ‌ట్టు స‌మిష్టిగా ఆడ‌టం వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని అన్నాడు టెంబా బావుమా.

Also Read : Supreme Court Important Case Hearing : సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

Exit mobile version