Mythri Makers : హైదరాబాద్ – ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Makers) పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు సినీ కార్మికులు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ , రాశీ ఖన్నా, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు తెలుగు సినీ కార్మికులు. నిత్యం నీతి సూత్రాలు వల్లించే పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి తన సినిమా షూటింగ్ కోసం ముంబై నుంచి సినిమా కార్మికులను తెచ్చుకోవడం, ఉపయోగించడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది పూర్తిగా తమను నిర్లక్ష్యం చేయడం తప్పా మరోటి కాదన్నారు. వారిని షూటింగ్ లో వాడుకోవడం పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారంటూ వాపోయారు.
Telugu Film Workers Slams Mythri Makers
తెలుగు సినిమా ఉద్యోగుల సంఘాలు తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నేటి నుండి బంద్‌కు పిలుపునిచ్చాయి. అయినప్పటికీ, మైత్రి మూవీ మేకర్స్ ముంబై నుండి తీసుకువచ్చిన కార్మికులను ఉపయోగించి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు సమాచారం.
షూటింగ్‌లో భాగమైన పవన్ కళ్యాణ్‌కు స్థానిక సాంకేతిక నిపుణుల పోరాటాల గురించి తెలియదా అని సినిమా కార్మికులు ప్రశ్నించారు. తెలుగు కార్మికులు న్యాయమైన జీతం కోసం పోరాడుతున్న సమయంలో బయటి కార్మికులను నియమించు కోవాలనే నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.పవన్ కళ్యాణ్, మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరూ తమ డిమాండ్లను విస్మరించి, స్థానికేతర కార్మికులను ఉపయోగించి షూటింగ్‌ను కొనసాగించారని, ఇది స్థానిక సినిమా కార్మికులకు ద్రోహం చేయడమేనని వాపోయారు.
Also Read : Choreographer Krishna Shocking : కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ అరెస్ట్
