Choreographer Krishna Shocking : కొరియోగ్రాఫ‌ర్ కృష్ణ మాస్ట‌ర్ అరెస్ట్

లైంగిక వేధింపుల‌పై పోక్సో కేసు

Hello Telugu - Choreographer Krishna Shocking

Hello Telugu - Choreographer Krishna Shocking

Choreographer Krishna : హైద‌రాబాద్ – కొరియో గ్రాఫ‌ర్ కృష్ణ మాస్ట‌ర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో టాలీవుడ్ లో క‌ల‌క‌లం రేపింది ఈ అంశం. ఇప్ప‌టికే శేఖ‌ర్ మాస్ట‌ర్ అరెస్ట్ కాగా. త‌ను బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఈ త‌రుణంలో మ‌రో కొరియోగ్రాఫ‌ర్ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది సినీ ఇండ‌స్ట్రీలో. ఒక మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై గచ్చిబౌలి పోలీసులు కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌ను (Choreographer Krishna) అరెస్టు చేశారు. తరువాత అతన్ని కంది జైలుకు పంపారు.

Choreographer Krishna Master Arrest

త‌ను ప్ర‌ముఖ రియాల్టీ షో ఢీకి కొరియోగ్రాఫ‌ర్ గా ఉన్నాడు. ఈ కార్య‌క్ర‌మంకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. బెంగళూరులోని అతని సోదరుడి నివాసంలో ఉండ‌గా అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలిక కుటుంబ సభ్యులు కృష్ణ మాస్టర్‌పై ఫిర్యాదు చేశారు, గత నెలలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కూడా ఇదే కేసు నమోదైంది. పోక్సో కేసు నమోదు చేసిన తర్వాత, కృష్ణ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లాడు.

ఇటీవల, కృష్ణ మాస్టర్ ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. అతను తన భార్య కు చెందిన రూ. 9.50 లక్షలతో పరారయ్యాడు. ఇంతలో, కృష్ణ మాస్టర్‌పై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనేక మంది యువతులు, మహిళలను మోసం చేసినట్లు అతనిపై అభియోగాలు నమోదయ్యాయి.

Also Read : Hero Pawan Kalyan OG Movie : షేక్ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ ఫైర్ స్టోర్మ్

Exit mobile version