Telangana : హైదరాబాద్ : సినీ రంగానికి చెందిన ప్రముఖులు, పెద్దలు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తో సమావేశం అయ్యారు. ఆయన ఆధ్వర్యంలో పైరసీ రాకెట్ ను పట్టుకున్నారు. టాలీవుడ్ కు చెందిన నటులు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాని తో పాటు ప్రముఖ నిర్మాత, తెలంగాణ (Telangana) ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి. వెంకట రమణ రెడ్డి బేటీ అయ్యారు. తన ఆద్వర్యంలో భారీ ఎత్తున పైరసీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు చాలా తెలివిగా. ఈ రాకెట్ సాగిస్తున్న మోసాన్ని ఛేదించారు. కొత్త సినిమాలతో పాటు పాత సినామాలను కాపీ చేసి, తెలివిగా తాము నిర్వహిస్తున్న వెబ్ సైట్స్ లలోకి అప్ లోడ్ చేయడం, డబ్బులు సంపాదించడం చేస్తూ వస్తున్నారు. డేటాను చౌర్యం చేయడం, ఆర్థిక మోసానికి పాల్పడినట్లు గుర్తించారు సీవీ ఆనంద్.
Telangana Police Strong Focus
ఈ సందర్బంగా ఎలా పైరసీకి పాల్పడుతున్నారనే దాని గురించి కూలంకుశంగా వివరించారు సినీ పెద్దలకు. సీనియర్ నటులు, నిర్మాతలు, ప్రదర్శకులు, డిజిటల్ పంపిణీదారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు తెలిపారు సీవీ ఆనంద్. ఇతర దేశాల నుంచి సర్వర్లను ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి వీటిని పైరసీకి పాల్పడుతున్నట్లు వెల్లడించారు. పైరసీని రెండు పద్దతులలో ఉపయోగిస్తున్నట్లు తేలిందన్నారు. సినిమాలను మొబైల్ ఫోన్‌లను ఉపయోగించి థియేటర్లలో రహస్యంగా రికార్డ్ చేస్తున్నారని చెప్పారు. తమిళ్ ఎంవి, టెయిల్ బ్లాస్టర్స్ మోవిరుల్జ్ వంటి పైరసీ పోర్టల్‌లను గుర్తించామన్నారు.
Also Read : Avoid Spam Calls Important Update : మీకు తరచూ స్పామ్ కాల్స్ వస్తున్నాయా? అయితే ఇలా చేయండి

















